రామోజీరావు మృతికి కారణం అదేనా..! వైద్యులు ఏం చెప్పారంటే..?
రామోజీరావు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించారు. సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.దేశంలో అత్యద్భుతంగా రామోజీ ఫిలిమ్ సిటినీ నిర్మించారు. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరి 1962 లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టి సారించారు.ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు.
వ్యాపార రగంలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించిన రామోజీరావు తీవ్ర అనారోగ్యంగో శనివారం ఉదయం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు స్టెంట్ వేయాలని సూచించారు.
స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స అందించారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారు జామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు.
హైదరాబాద్ లో హాలీవుడ్ తరహాలో ఒక ఫిలిమ్ సిటీ నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఆ కల నెరవేర్చుకోవడానికి ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇక్కడికి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన వారు దిగ్బ్రాంతికి గురయ్యారు.