అయోధ్య రామ్ లల్లా ఎదుట క్షమాపణ కోరిన ప్రధాని మోదీ, ఏం జరిగిందో తెలుసా..?
శ్రీరాముడు ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, రామమందిరం యావత్ భారతదేశానికి ప్రతీక. అన్ని మతాల వారిని ఏకతాటిపైకి తీసుకెళ్తూ.. రాముడు భారతదేశంలోని ప్రతి మూలలో ఉంటాడు. రామ అంటే జ్యోతి, అగ్ని కాదు. రామమందిరం ఒక దేవాలయం మాత్రమే కాదని, ప్రతి భారతీయునికి చెందుతుందని, ఇది మొత్తం దేశానికి చెందిన ఐక్య దేవాలయమని మోదీఅన్నారు.
అయితే రాముని జన్మస్థలం లో 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు. సరిగ్గా 12.29 గంటలకు ప్రారంభమైన ప్రతిష్ఠ 84 సెకెన్ల పాటు జరిగింది. అయితే ఈ సమయంలో రాముడికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంలో జాప్యం జరిగినందుకు క్షమాపణలు చెప్పారు. నేడు చేస్తున్న పనులు శతాబ్దాలుగా పూర్తి చేయలేనివని అన్నారు.
రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో ప్రముఖులు, వీవీఐపీలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ఈరోజు నేను శ్రీరాముడికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా మనం కృషి, త్యాగాలు, తపస్సులు చేసినా ఈ పని జరగకపోయినందుకు మన్నించాలన్నారు. ఆలయ నిర్మాణంలో జాప్యం అంటే ఏదో వెలితి తప్పదు… ఈరోజు పని పూర్తయింది..ఈరోజు రాముడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నమ్ముతున్నాను అని మోదీ అన్నారు. రామ్ లల్లా ఇక గుడారంలో కాకుండా ఒక పెద్ద గుడిలో ఉంటారు.
జనవరి 22న సూర్యోదయం అద్భుతమైన ప్రకాశాన్ని తీసుకొచ్చింది. జనవరి 22, 2024, క్యాలెండర్‌లో వ్రాసిన తేదీ కాదు. ఇదే కొత్త కాలచక్రానికి మూలం అని మోదీ అన్నారు. శతాబ్దాల తపస్సు,బలిదానాలు,త్యాగాల తర్వాత ఈరోజు మన రాముడు అయోధ్యకు వచ్చాడు.. మన రాముడు ఇక నివసించేది గుడారంలో కాదు, దైవ దేవాలయంలో. ఈ క్షణం చాలా పవిత్రమైనది. ఈ క్షణం అత్యద్భుతం. ఈ శక్తి, సమయం మనందరికీ శ్రీరాముడు అందించిన వరం అని మోదీ అన్నారు.