రాంచరణ్ కూతురు క్లీంకార కేర్‌టేకర్ ఎవరో తెలుసా..? ఆమె జీతం ఎంతో తెలిస్తే..?
రాంచరణ్, ఉపాసన దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఆ పాపకు కొణిదెల క్లింకర అని పేరు కూడా పెట్టాడు. ఇప్పుడు తమ కూతురిని పెంచేందుకు బాలీవుడ్ సెలబ్రిటీల స్టైల్‌ని ఫాలో అయ్యారు మెగా జంట. ఉపాసన, రామ్ చరణ్ తమ కూతురి కోసం ప్రత్యేకంగా ఓ గదిని డిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూతురి సంరక్షణ కోసం ప్రముఖ నానీ(ఆయాను) నియమించారు. నెలకు మూడు లక్షల జీతం ఇస్తున్నారు.
అయితే క్లీంకార.. ఈ పేరు గుర్తుందా.. కొందరికి ఉంటుంది. ముఖ్యంగా మెగా అభిమానులకు తెలుసు. అవును రామ్‌చరణ్–ఉపాసన దంపతుల గారాలపట్టి. ఈ చిన్నారి జన్మించాక మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. మెగా ప్రిన్సెస్ రాక తర్వాత చిరంజీవి కుటుంబంలో ఎప్పుడు సందడే కనిపిస్తుంది. తాజాగా ఈ మెగా ప్రిన్సెస్‌ను చూసుకునేందుకు నానీ(కేర్ టేకర్ లేదా ఆయా)ను నియమించుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేర్‌టేకర్ పేరు సావిత్రి. గతంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపుర్ – సైఫ్ అలీఖాన్ దంపతుల కుమారుడు తైమూర్‌కు ఈమె కేర్ టేకర్‌గా పనిచేసింది. ఆపై షాహిద్‌కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్‌టేకర్‌గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్ అయిన కీంకార ఆలనా పాలన చూసే బాధ్యతలను మెగా ఫ్యామిలీ సావిత్రికి అప్పగించారు. చాలా రోజుల క్రితం చరణ్–ఉపాసన దందపతులు సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం చరణ్, ఉపాసన వారివారి విధుల్లో బీజీ అయ్యారు. చర్రీ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయాడు.
ఇక ఉపాసన అపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. దీంతో క్లీంకారను చూసుకునేందుకు కేర్‌టేకర్ అవసరం ఏర్పడింది. అందుకే సావిత్రిని ఎంపిక చేసుకున్నారు. కూతురు కోసం లక్షలు వెచ్చించి ఇంట్లో కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. తాజాగా కేట్ టేకర్‌ను కూడా నియమించుకున్నారు. ఈమెకు నెలకు లక్షన్నర వేతనం ఇవ్వనున్నట్లు తెలిసింది.