రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు. నోటిఫికేషన్ పూర్తీ వివరాలు ఇవే.
సామాన్యుడి నేల విమానంగా పేరొందిన ట్రైన్ జర్నీకి ఆదరణ ఎక్కువ. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండడం.. సమయం ఆదా అవడంతో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. అయితే నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్ పరిధిలోని డివిజన్, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,647 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ఎస్&టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3, 2024వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కతిహార్ & తింధారియా, అలీపుర్‌దువార్, రంగియా, లుమ్‌డింగ్, టిన్‌సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్‌ఎఫ్‌ఆర్ హెడ్ క్వార్టర్/ మాలిగావ్ డివిజన్‌లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు…మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 5,647. తిహార్ & తింధారియాలో ఖాళీలు: 812. అలీపుర్‌దువార్‌లో ఖాళీలు: 413. రంగియాలో ఖాళీలు: 435. లుమ్‌డింగ్లో ఖాళీలు: 950. టిన్‌సుకియాలో ఖాళీలు: 580. న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్లో ఖాళీలు: 982. దిబ్రూగర్‌లో ఖాళీలు: 814. ఎన్‌ఎఫ్‌ఆర్‌లో ఖాళీలు: 661. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 3, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐలో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.