మైనస్ డిగ్రీ టెంపరేచర్లో బికినీలో రకుల్ హల్చల్.
ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా కొన్ని రకాల పద్ధతుల ద్వారా వ్యాధిని నయం చేసుకోవడమే ఈ థెరపీల ముఖ్య ఉద్దేశం. తాజాగా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాంటి ఓ థెరపీని తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిందీ బ్యూటీ. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈసినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇక అది అలా ఉంటే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి. రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట. ఈ విషయంలో త్వరలో రకుల్ ఓ ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇటీవలే మరో ప్రేమ జంట కియారా, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఛత్రివాలీ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా OTTలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ యాప్ జీ5లో జనవరి 20నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ సినిమా కోసం రకుల్ చేయాల్సినంత ప్రమోషన్స్ చేసింది.
అయితే అనుకున్న రేంజ్లో మాత్రం ఛత్రివాలీ ఆకట్టుకోలేకపోయింది. ఛత్రివాలీ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా OTTలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ యాప్ జీ5లో జనవరి 20నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ సినిమా కోసం రకుల్ చేయాల్సినంత ప్రమోషన్స్ చేసింది. అయితే అనుకున్న రేంజ్లో మాత్రం ఛత్రివాలీ ఆకట్టుకోలేకపోయింది. ఇక మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదని అంటున్నారు. ప్రస్తుతం అవకాశాల్లేక ఆమె సతమతమవుతున్నారని తెలుస్తోంది. దీంతో రెమ్యూనరేషన్ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విషయం ఏమంటే.. రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్తా సడలింపు ఇచ్చారట. ఒక్కసారిగా కాకుండా.. రోజురోజుకు.. అంటే డైలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చారట.ఒకప్పుడు హీరోయిన్గా నటించడానికి ఆమె ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకున్నారట. కాగా ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటున్నారట రకుల్.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక రకుల్ ప్రస్తుతం తెలుగులో ఎలాంటీ సినిమాలు చేయడం లేదు.