రజినీకాంత్ గొప్ప మనసు, పేదల కోసం ఏకంగా 12 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణం చేస్తున్న తలైవా.
రజినీకాంత్ నిజ జీవితంలో మాత్రం ఆయన వీలైనంత సాదాసీదాగా ఉండాలనుకుంటారు. పెద్దగా ఆడంబరాలకు వెళ్లరు. హిమాలయాల్లో రోడ్లపై నిల్చొని అందరితో కలిసి భోజనాలు చేయడం, విగ్గులు వాడకపోవడం.. ఇలా ఆయన సింప్లిసిటీకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అయితే రజనీకాంత్ ఒ గొప్ప కార్యాన్ని తలపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి కుదరలేదు కాబట్టి ప్రజలకోసం ఏదైనా చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారట.
అందుకోసం.. పేలకు అవసరమైన విద్య వైద్యం మీద దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన 12 ఏకరాల్లో భారీ హాస్పిటల్ ను నిర్మించబోతున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం చెన్నైలోని తిరుప్పోరూర్లోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన రిజిస్టేషన్ ను కూడా కంప్లీట్ చేశారు రజినీకాంత్. అప్పుడు రజనీకాంత్ వస్తున్నారని తెలియడంతో ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంలో, రజనీకాంత్ అక్కడికి చేరుకున్న తర్వాత ఈ విషయం లీక్ అయ్యింది. దీని ప్రకారం చెన్నై ఓఎంఆర్ రోడ్డు నుంచి దల్హంపూర్ వెళ్లే దారిలో 12 ఎకరాల భూమిని రజనీ కొనుగోలు చేశారు. డీడీ నమోదు చేసేందుకు రజినీ తిరుపోరూర్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. ఇక ఆ స్థలంలో రజనీకాంత్ భారీ ఆసుపత్రిని నిర్మించే పనిలో ఉన్నారట.
ఈ ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందిచేలా ప్రణాళిక రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బాగా డబ్బున్న వారికి కూడా ఇక్కడ వైధ్య లభిస్తుంది. కాని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారని అంటున్నారు. నివేదికల ప్రకారం, ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి, ప్రస్తుతం వరుసగా షూటింగ్స్ బిజీలో ఉన్న తలైవా.. ఈ హాస్పిటల్ పనులను తన స్నేహితుడికి అప్పగించినట్టు తెలుస్తోంది.