ఎన్నికల ముందు రాజకీయనాయకులు రాజశ్యామల యాగం ఎందుకు చేస్తారో తెలుసా..? దాని ఫలితాలు తెలిస్తే..?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాటలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో నేడు రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుండి మూడు రోజులపాటు పాటు చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాజశ్యామల శ్యామల యాగాన్ని చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి బాగా పెరుగుతోంది. దాన్ని మరింత పెంచుతూ.. చంద్రబాబు యాగాలు, హోమాలూ చేస్తున్నారు. ఇప్పటికే తన సతీమణి తో కలిగి పలు యాగాలు చేసిన చంద్రబాబు తాజాగా రాజశ్యామల యాగం చేపట్టారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.
ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తరచూ హోమాలు, యాగాలూ చేసేవారు. చండీయాగం, రాజశ్యామల యాగం వంటివి చేసేవారు. రాష్ట్ర క్షేమం, ప్రజా సంక్షేమం కోసమే యాగాలు చేస్తున్నట్లు చెప్పేవారు. ఇప్పుడు అదే బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా ఆయన చేసిన హోమం, యాగం హాట్ టాపిక్ అయ్యింది. మన పురాణాల్లో రాజసూయ యాగం, రాజ శ్యామల యాగాల గురించి ప్రస్తావన ఉంది. రాజ్యలక్ష్మి వరించాలని.. విజేతగా నిలిచేలా చేయాలని ఈ రెండు యాగాలు చేస్తారు. సూయం అంటే శాశ్వతం… రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేది కునుకే రాజసూయ యాగం అంటారు. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని రాజ శ్యామల యాగం చేస్తారు. రాజసూయ యాగం..ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయిస్తాడు. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన.
శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు. అయితే రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సాధ్యం కాదు. అందుకే దానికి ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయేమని శ్యామలా దేవిని ప్రశన్నం చేసుకుంటారు. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, లేదా మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు..ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా చేస్తారు. ప్రస్తుతం చంద్రబాబు, గతంలో కేసీఆర్ మూడు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు.