Health

రాగి అటుకులను బ్రేక్ ఫాస్ట్ గా తింటే రెండు వారాల్లో వేగంగా బరువు తగ్గుతారు.

రాగుల వ‌లె ఈ అటుకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి అటుకుల‌తో మ‌నం రుచిక‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. అయితే మన పూర్వీకులు ఎక్కువగా చిరుధాన్యాలను వినియోగించేవారు. అందుకే వారంతా దృఢమైన శరీరాన్ని కలిగుండడమే కాకుండా ఆరోగ్యంగా జీవించగలిగారు. చిరుధాన్యాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

కాబట్టి వీటితో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి. అందుకే పూర్వీకులు వీటిని ఎక్కువగా వినియోగించే వారిట. అయితే ప్రస్తుతం చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా శరీర బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటితో తయారుచేసిన ఆహారాలను డైట్ లో చేర్చుకుంటున్నారు.

ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో ఊబకాయం సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను డైట్లో వినియోగించాల్సి ఉంటుంది. రాగులతో తయారుచేసిన అటుకులను ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే రాగి అటుకులు తయారు చేసుకునే విధానం.. అటుకులకు కావాల్సిన పదార్థాలు.. పది రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులు, తగినంత పటిక బెల్లం, నానబెట్టిన చియా గింజలు, ఒక కప్పు నీరు, ఒక కప్పు రాగి అటుకులు. రాగి అటుకుల తయారీ పద్ధతి.. ఈ అటుకులు తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి.

ఈ మిక్సీ జార్ లో ఒక కప్పు నీటిని వేసి అందులోనే పట్టిక బెల్లం, జియా గింజలు, పొట్టు తీసిన బాదంపప్పు వీటన్నిటిని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి ఓ గ్లాసులో సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న గ్లాసులో రాగి అటుకులను వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా రాగి అటుకులను కలిపిన తర్వాత తింటే కరకరలాడుతూ నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker