ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు ఇవే, వీటి ప్రత్యేకత ఏంటంటే..?
పుట్టగొడుగుల్లో తినేవి ఉన్నట్లే.. మందుల తయారీకి ఉపయోగించేవీ ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఔషధ గుణాలు ఎక్కువ. విటమిన్లు, అమైనో ఆమ్లాలు వాటిలో ఉంటాయి. పుట్టగొడుగులను తినడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. బరువు తగ్గడంలో కూడా ఇవి చాలా సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే పుట్టగొడుగుల గురించి తెలియని వారుండరు.
వర్షాకాలంలో పొలాల్లో కుప్పలుతెప్పలుగా మొలిచే ఓ రకమైన మొక్కలు ఇవి. వీటిని కృత్రిమ పద్ధతుల్లో కూడా పండిస్తుంటారు. ఐతే ప్రపంచంలో కొన్ని అరుదైన పుట్టగొడుగులు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సంజీవని వంటివి. వీటి ఖరీదు కూడా మామూలుగా ఉండదు. ఏకంగా లక్షల్లో ఉంటుంది. గుచ్చి మష్రూమ్.. ఈ అడవి పుట్టగొడుగు హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి చైనా, నేపాల్, భారత్, పాకిస్తాన్‌లలో పెరుగుతాయి.
అనేక ఔషధ గుణాలు కలిగిన వీటిని స్పాంజ్ మష్రూమ్ అని కూడా అంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గుచ్చి మష్రూమ్ కిలో రూ.25,000 నుంచి 30,000 వరకు విక్రయిస్తుంటారు. ఈ మష్రూమ్‌కు విదేశీ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్..ఈ అడవి పుట్టగొడుగు హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి.
ఇవి చైనా, నేపాల్, భారత్, పాకిస్తాన్‌లలో పెరుగుతాయి. అనేక ఔషధ గుణాలు కలిగిన వీటిని స్పాంజ్ మష్రూమ్ అని కూడా అంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గుచ్చి మష్రూమ్ కిలో రూ.25,000 నుంచి 30,000 వరకు విక్రయిస్తుంటారు. ఈ మష్రూమ్‌కు విదేశీ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.
బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్..ఇవి ఐరోపాలోని వైట్ ట్రఫుల్ మష్రూమ్‌ను పోలి ఉంటుంది. ఇది కూడా చాలా అరుదైన పుట్టగొడుగు. ఈ పుట్టగొడుగులను వెదకడానికి శిక్షణ ఇచ్చిన కుక్కలను ఉపయోగిస్తుంటారు. విదేశీ మార్కెట్లలో వీటి ధర కిలో రూ. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పలుకుతుంది.