ఇండస్ట్రీలో మరో విషాదం. సీనియర్ నటి పుష్పలత కన్నుమూత.
గత కొన్నేళ్లుగా సినీ చెన్నైలోని టీ.నగర్‌లో నివసిస్తున్న ఆమె.. వృద్ధాప్య కారణంగా అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే పుష్పలత మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
సీనియర్ నటుడు ఏవీఎం రాజన్ సతీమణి.. ఒకప్పటి నటి పుష్పలత కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. చెన్నైలోని టీ.నగర్, తిరుమల పిళ్లై రోడ్డులోని నివాసంలో ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
1958లో విడుదలైన సెంగోట్టై సింగం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు పుష్పలత. ఆ తర్వాత 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో కథానాయికగా కనిపించారు. నానుమ్ ఒరు పెణ్ అనే సినిమాలో నటుడు ఏవీఎం రాజన్ కు జోడిగా నటించారు. అదే సమయంలో వీరిద్దరు స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఆయననే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పుష్పలత. వీరికి ఇద్దరు సంతానం. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు పుష్పలత. పెద్దకొడుకు, మేము మనుషులమే, అన్నదమ్ముల అనుబంధం, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించారు.
ఏవీఎం సంస్థ నిర్మించిన రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ నటించారు పుష్పలత.