ఈ పర్పుల్ క్యాబేజీ తింటే మీ ఎముకల బలంతోపాటు, గుండె జబ్బులు కూడా రావు.
ఎముకలను బలోపేతం చేస్తుంది. కొన్ని క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న రెడ్ క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం సులభం. పర్పుల్ క్యాబేజీని రెడ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు, ఇది బ్రాసికా జాతి మొక్కలకు చెందినది. అయితే పర్పుల్ క్యాబేజీని రెడ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. పర్పుల్ రకంలో ఎముకలు బలానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చిగా సలాడ్స్ లో తీసుకోవచ్చు. అంతేకాకుండా కూరగా వండుకుని తినవచ్చు. వివిధ రూపాల్లో దీనిని తీసుకున్నా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అందుతాయి. పర్పుల్ క్యాబేజీ ఆరోగ్య ప్రయోజనాలు :- పర్పుల్ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కు మంచి మూలంగా చెప్పవచ్చు. విటమిన్లు A, C, K మరియు B6. ఇతర విటమిన్లు , ఖానిజాలు ఉంటాయి.
పర్పుల్ క్యాబేజీ లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు మరియు ఆంథోసైనిన్స్ మరియు కెంప్ఫెరోల్ వంటి ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్ స్థాయిలు ఆకుపచ్చ క్యాబేజీ రకాల్లో కంటే 4.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పర్పుల్ క్యాబేజీ సల్ఫోరాఫేన్ మూలంగా చెప్పవచ్చు. సల్ఫోరాఫేన్ శక్తివంతమైన గుండె ఆరోగ్య ప్రయోజనాలతోపాటుగా, క్యాన్సర్-పోరాట లక్షణాలను కలిగి ఉంటుంది. పర్పుల్ క్యాబేజీ మంటతో పోరాడటానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.
నొప్పి, వాపు , అసౌకర్యం వంటి లక్షణాలను పోగొడుతుంది. పర్పుల్ క్యాబేజీలోని ఆంథోసైనిన్‌ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గింస్తాయి. పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి మరియు కె1 పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. పర్పుల్ క్యాబేజీ కాల్షియం వంటి ఎముకలకు మేలు చేసే పోషకాలను కూడా కలిగి ఉంటుంది. మాంగనీస్, మరియు జింక్ వంటివి వాటిని కూడా పొందవచ్చు.
పర్పుల్ క్యాబేజీలో ఉండే సల్ఫోరాఫేన్ వంటి ప్రయోజనకరమైన సమ్మేళనాలు, ఆంథోసైనిన్స్ శరీరాన్ని కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది. దీనిపై ప్రస్తుతం లోతైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. పర్పుల్ క్యాబేజీ తీసుకోవటం వల్ల బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో పేగు వాపు, పూత వంటి వాటిని నివారించడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.