Health

వీటిని తింటే మీ రక్తంలో వ్యర్ధాలు తొలిగిపోయి రక్తం శుభ్రంగా తయారవుతుంది.

శరీరంలోని రక్తం మొత్తాన్ని శరీర బరువు ఆధారంగా అంచనా వేస్తారు. పిల్లలు, పెద్దలలో రక్తం అవసరం వారి వయస్సు ప్రకారం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల బలహీనత లేదా శరీరంలో రక్తం కొరత ఏర్పడుతుందని అంటారు. కానీ అది అలా కాదు. రక్తదానం చేసిన మూడు నెలల తర్వాత, శరీరం మళ్లీ తగినంత రక్తాన్ని తయారు చేస్తుంది. దానిని మళ్లీ దానం చేయవచ్చు. అయితే శరీరానికి అతి ముఖ్యమైనది రక్తం. శరీరంలోని అన్నిఅంగాలకు కావల్సిన పోషకాల్నిఅందించేది రక్తమే.

ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. రక్తం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. రక్తంలో వ్యర్ధాలుంటే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. రక్తంలో వ్యర్ధ పదార్ధాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుభ్రం చేయడం చాలా అవసరం. డైట్‌లో కొన్ని వస్తువుల్ని చేర్చడం ద్వారా రక్తాన్ని శుభ్రం చేయవచ్చు. తులసి.. తులసిలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుల్లో ఉండే ఆక్సిజన్ కారణంగా రక్తం శుభ్రమౌతుంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి వ్యాధుల్ని దూరం చేయడంలో దోహదపడతాయి. తులసి అనేది ఇమ్యూన్ సిస్టమ్‌ను బలంగా చేస్తుంది. వేప.. వేప రక్తాన్ని శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపాకుల్ని నమిలి తినడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్ధాలు దూరమౌతాయి. వేపాకులు శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా మార్చుతాయి. బీట్‌రూట్..బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

బీట్‌రూట్‌లో బీటో సయామిన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రం చేసే పని చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ లేదా బీట్‌రూట్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. చాలా వ్యాధుల్ని కూడా దూరం చేస్తుంది. పసుపు..పసుపు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఇందులో ఉండే కర్‌క్యూమిన్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. పసుపు తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. ఐరన్ లోపం దూరమౌతుంది.

బెల్లం..బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో పేరుకున్న వ్యర్ధాల్ని చాలా సులభంగా తొలగించగలదు. బెల్లం తినడం వల్ల ఐరన్ లోపం దూరమౌతుంది. బెల్లంతో జీర్ణ సంబంధిత సమస్యలైన అజీర్తి, మలబద్ధకం దూరమౌతాయి. బెల్లం తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. వెల్లుల్లి..వెల్లుల్లి రక్తానికి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల రక్తం శుభ్రమౌతుంది. బెల్లంతో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker