పురుషుడి నుంచి అండాలు, మహిళ నుంచి శుక్రకణాలతో మానవ పునరుత్పత్తి ప్రక్రియ, దీని పై శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?
పురుషుడి శరీరం స్పెర్మ్ అని పిలువబడే మగ గామేట్‌లను తయారు చేస్తుంది. సంభోగం సమయంలో, ఒక పురుషుడు స్త్రీ శరీరంలోకి మిలియన్ల కొద్దీ స్పెర్మ్‌లను స్ఖలనం చేస్తాడు. పురుష పునరుత్పత్తి వ్యవస్థ స్పెర్మ్‌ను నిల్వ చేస్తుంది మరియు రవాణా చేస్తుంది. దీన్ని నియంత్రించేందుకు మగ శరీరంలోని రసాయనాలను హార్మోన్లు అంటారు. అయితే శాస్త్రవేత్తలు తాజాగా తీసుకురానున్న అత్యాధునిక ఐవీజీ సాంకేతికతో దాదాపుగా అవే పరిస్థితులు రానున్నాయి. సాధారణంగా పురుషుల నుంచి శుక్రకణాలు, స్త్రీల నుంచి అండాలు విడుదలవుతాయి.
ప్రస్తుతం ఈ విధానంతో మానవుల్లో పునరుత్పత్తి జరుగుతోంది. కానీ, మానవ పునరుత్పత్తి ప్రక్రియ మారనుంది. పురుషుడి నుంచి అండాలు, మహిళ నుంచి శుక్రకణాలు సృష్టిస్తారు. ఈ విధానంలో పురుషులు మహిళలుగా, మహిళలు పురుషులుగా మారనప్పటికీ పురుషుల ద్వారనే ఇప్పటివరకు సాధ్యమవుతున్న శుక్రకణాలను మహిళల సాయంతో, స్త్రీల నుంచి సేకరిస్తున్న అండాలను పురుషుల సాయంతో సృష్టించవచ్చు.
పురుషడి చర్మంలోని మూల కణాలతో అండాన్ని, స్త్రీ చర్మంలోని మూల కణాలతో శుక్రకణాలను ఐవీజీ టెక్నిక్ సాయంతో పరిశోధకులు తయారు చేయాలనుకుంటున్నారు. 2012లో ఆడ, మగ ఎలుకల తోక చర్మం నుంచి సేకరించిన మూల కణాలతో పరిశోధకులు వరుసగా అండం, శుక్రకణాలను సృష్టించారు. అంతేకాకుండా ప్రయోగశాలలో కృత్రిమ గర్భధార పద్ధతిలో టెస్ట్ ట్యూబ్ ఎలుకకు జీవం పోశారు. ఇప్పుడు అదే విధానంలో మనుషుల్లోనూ ప్రయోగాలు చేయాలని యోచిస్తున్నారు. క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో అండాల విడుదల సక్రమంగా ఉండదు.
మరికొందరు మహిళలకు వయసు రీత్యా గర్భధారణ జరిగే అవకాశమూ దూరం కావచ్చు. మారిన జీవనశైలి కారణాలతో పురుషుల్లోనూ సంతాన సమస్యలు తలెత్తున్నాయి. ఇలాంటి దంపతులకు తమ మూల జీవ కణాల ద్వారానే సృష్టించే సంతానాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు.