అభిమాని డబుల్ మీనింగ్ అర్థం కాక, అవి చూపించిన హీరోయిన్. చివరికి ఏమందంటే..?
యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ సైతం అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని మీ చేతి గోళ్లు చూపించాలని రిక్వెస్ట్ చేశాడు. ఏమాత్రం ఆలోచించకుండా అంతేనా అంటూ… చేతి గోళ్ళను ఫోటో తీసి షేర్ చేసింది. అయితే కొందరు ఆకతాయులు ఫన్నీ ప్రశ్నల్లాంటివి అడుగుతుంటారు.
తాజాగా ప్రియాంక మోహన్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. నాని’ గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత ‘శ్రీకారం’ అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పూర్తిగా తమిళంకే పరిమితమైపోయింది. మళ్లీ ఇప్పుడు ‘ఓజీ’, ‘సరిపోదా శనివారం’ లాంటి తెలుగు చిత్రాలు చేస్తోంది.
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక మోహన్.. ‘ఆస్క్ ఎనీథింగ్’ అని చిన్న ఫన్ సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్/అభిమాని.. ‘మీ గోళ్లు చూపించండి మేడమ్’ అని అడిగాడు.
దీనికి బదులిచ్చిన ప్రియాంక.. తన చేతిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ‘వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో ఏంటో’ అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.