మహిళలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, కొత్త ధరలు ఇవే.
బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఫిబ్రవరి నెల ఆరంభంలో రూ. 63,440 వద్ద ఉంది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఈ బంగారం ధర నెల చివరకు వచ్చే సరికి రూ. 62,830కు తగ్గింది. అంటే గోల్డ్ రేటు రూ. 600కు పైగా దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు.
22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు ఫిబ్రవరి నెల ఆరంభంలో రూ. 58,150 వద్ద ఉంది. అయితే నెల చివరికి వచ్చే సరికి పసిడి రేటు రూ. 57,590కు క్షీణించింది. అంటే ఈ గోల్డ్ రేటు రూ. 560 తగ్గింది. అంటే బంగారం ధరలు గత నెలలో దాదాపు ఒక శాతం మేర నేల చూపులు చూశాయి. ఈ 24 క్యారెట్ల బంగారం రేటు ఈ 2న రూ. 63,600 గరిష్ట స్థాయికి చేరింది. ఇంకా ఈ 15న రూ. 62,070 కనిష్ట స్థాయికి తగ్గింది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ 2న రూ. 58,300కు చేరింది. ఇక ఫిబ్రవరి 15న రూ. 56,900 స్థాయికి తగ్గింది. వెండి ధరల విషయానికి వస్తే.. సిల్వర్ రేటు గత నెల ఆరంభంలో రూ. 77,800 వద్ద ఉండేది. కేజీకి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే ఈ నెల చివరకు వచ్చేసరికి వెండి ధర రూ. 75,700కు తగ్గింది. అంటే వెండి రేటు గత నెలలో ఏకంగా రూ. 2,100 మేర పతనమైందని చెప్పుకోవచ్చు.
వెండి రేటు ఈ నెలలో 2.7 శాతం మేర దిగి వచ్చింది. అలాగే వెండి రేటు రూ. 75,400 స్థాయికి కూడా తగ్గింది. ఇదే నెలలో కనిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2న వెండి రేటు రూ. 78 వేలకు ఎగసింది. ఇది నెలలో గరిష్ట స్థాయి. కాగా బంగారం ధరలను గమనిస్తే.. 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 64,090 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 58,750 వద్ద కొనసాగుతోంది. పది గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక వెండి రేటు కేజీకి రూ. 77 వేల వద్ద ఉంది.