Health

గర్భం దాల్చాలంటే దంపతులు ఏ సమయంలో కలిస్తే మంచిదో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా వివాహం అనంతరం గర్భం దాల్చడంలో చాలా మంది మహిళలు సమస్యలు ఎదుర్కుంటున్నారు. కొందరు ఏదో ఒక కారణంతో కొందరు గర్భం దాల్చలేకపోతున్నారు. అయితే వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది.. పెళ్లి తర్వాత ఎన్నో కలలు ఆకాంక్షలతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. సొంత కుటుంబం అనే భావనతోపాటు.. బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఇది అందరికీ చెప్పినంత సులువు కాదు.. అయితే.. ప్రతీ దంపతులు సొంత బిడ్డ కావాలని కలలు కనడం సహజం. దీన్ని నిజం చేసే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.

ఇలాంటి సమయంలో సంతానోత్పత్తి కోసం శృంగారం ఎప్పుడు చేయాలి.. సరైన సమయం ఏమిటి..? అనే విషయాలు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల కూడా సంతానం కలగదంటున్నారు వైద్య నిపుణులు.. వాస్తవానికి పిల్లలు పుట్టకపోవడానికి అనేక రకాల ఆరోగ్య సంబంధిత కారణాలు ఉండవచ్చు. కానీ చాలా సందర్భాలలో దంపతులకు కొన్ని విషయాల గురించి తెలియనప్పుడు.. గర్భధారణ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఋతు చక్రం రోజుల గురించి సరైన సమాచారం లేకపోవటం లేదా అండోత్సర్గము రోజులను తప్పుగా అర్థం చేసుకోవడం.. మొదలైనవి.

కావున ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే అది చాలా సంవత్సరాలపాటు నిరాశకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భంలో.. ఋతుస్రావం అయిన 7 రోజుల తర్వాత జంట శృంగారం చేయాలి. రోజువారీ సంభోగం లేదా ప్రతి రెండు రోజులకు ఒకసారి అనువైనది.. మీరు ఈ సమయంలో రొమాన్స్ చేసినట్లయితే.. మీరు గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. పీరియడ్స్ కాలానుగుణంగా.. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే గర్భం దాల్చడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పిరీయడ్స్ వచ్చే వారం ముందు కలయిక గర్భంగా దల్చడానికి అంతగా ప్రయోజనం చేకూర్చదని పేర్కొంటున్నారు. అయితే.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కు ముందు, భార్యాభర్తలు ఇద్దరూ..

అనుభవజ్ఞులైన ప్రసూతి వైద్యులచే విడివిడిగా పరీక్షించి, గర్భధారణకు ఎటువంటి ఆటంకం లేదని నిర్ధారించుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ఏదైనా సమస్య వస్తే తగిన చికిత్సలతో పరిష్కరించుకోవచ్చు. అందుకే.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి తెలుసుకుంటే.. గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. చిట్కాలు, సమయాలను సరిగ్గా పాటించడం ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా గర్భం దాల్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కు ముందు మంచి జీవనశైలిని అనుసరించాలి.. దీంతోపాటు.. మద్యపానం, ధూమపానం లాంటివి బంద్ చేయాలని.. మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker