News

ప్రణీత్ హనుమంతు ఎవరు..? అతని బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే..?

యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు పాపులర్ అయ్యాడు. అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద… తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ… ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్‌ హేయమైన, నీచమైన కామెంట్స్ చేశారు. అయితే అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద… తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ… ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. దీనిపై అతడి బ్యాచ్ నీచమైన కామెంట్స్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయంపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు.

ఆయన తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్, నిర్మాత అహితేజ బెల్లంకొండతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించడంతో ప్రణీత్ పేరు సామాజిక మాద్యమాల్లో మారుమోగుతోంది. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ సాయి ధరమ్ తేజ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, తెలుగు రాష్ట్రాల డీజీపీలు స్పందించారు.

ప్రణీత్‌పై కేసు నమోదు చేశామని తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో తాను ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని.. తనను క్షమించాలని ప్రణీత్ కోరాడు. ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యారు. ‘ఏ జూడ్’ ఛానల్‌ను ప్రణీత్ సోదరుడు అజయ్ హనుమంతు నడిపిస్తున్నాడు. ప్రణీత్‌కు అజయ్ అన్నయ్య. ప్రణీత్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన హరోం హరలో ప్రణీత్ హనుమంతు నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు.

హరోం హర కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఒరిజినల్ ఫిల్మ్ మై డియర్ దొంగలో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు. ఇలా సినిమాల్లో నటించిన ప్రణీత్ హనుమంతు తన అతి వల్ల ప్రస్తుతం తన అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker