ప్రభాస్‌కు అనారోగ్యం, వైద్యులు ఏం చెప్పారంటే..?
ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తియనట్లు సమాచారం. అలాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పాటు మారుతి డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయనున్నాడు. అలాగే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌లోనూ నటించనున్నాడీ యంగ్ రెబల్ స్టార్.
ఇది కాకుండా ప్రభాస్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో సిద్ధార్థ్ ఆనంద్ ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ …కూడా పూర్తి చేశాడు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇవన్నీ వందల కోట్ల బడ్జెట్లో రాబోతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించే సినిమా రానుంది. వీటితో పాటు దిల్ రాజుతో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించేశాడు.
ఇలా వరుస సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్లినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ నెలలో మారుతి సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కావాలి. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనాల్సింది.
కానీ జ్వరం కారణంగా అది వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్ సన్నిహితులు అంటున్నారు. విశ్రాంతి లేకుండా వరుస సినిమాల ఘూటింగ్స్‌లో పాల్గొనడం వల్లే ఆయన జ్వరం బారిన పడినట్లు తెలుస్తోంది.