ఉప్పుకు బదులు సైంధవ లవణం నీరు తాగితే ఈ రోగాలు రానేరావు.
సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు. కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ వంటి 84 రకాల పోషకాలు ఉంటాయి.ఇవి మన శరీరానికి అవసరమైన పోషణను ఇస్తాయి. అయితే సాధారణ ఉప్పుకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యాహ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు దీనిలో ఉంటాయి.
సైంధవ లవణం నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి, శరీరం నుండి కోల్పోయే ఖనిజాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. సైంధవ లవణం వేసిన నీరు తరచూ తాగుతూ ఉంటే.. శరీరానికి అవసరమైన మిటమిన్లు, మినరల్స్ అందతాయి. మన రోగనిరోధక శక్తి పెరగడానికి ఇది తోడ్పడుతుంది. కండరాల నొప్పులతో బాధపడేవారిలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు క్షీణిస్తాయి. అటువంటి పరిస్థితిలో నీటిలో ఒక టీస్పూన్ సైంధవ లవణం వేసుకుని తాగితే కొన్ని నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. సైంధవ లవణంలో ఐరన్ ఉంటుంది.
దీని కారణంగా శరీరంలో రక్థ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది. సైంధవ లవణం నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ముక్కులో శ్లేష్మాన్ని తొలగించటానికి సైంధవ లవణం సహాయపడుతుంది. గొంతు నొప్పి, గొంతులో మంట ఉన్నప్పుడు సైంధవ లవణం నీటిని పుక్కిలిస్తే సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
సైంధవ లవణం వల్ల చర్మానికి ప్రయోజనాలు కలుగుతాయి. చర్మంపై పొలుసులు ఏర్పడితే వాటిని తొలగిస్తుంది. మొటిమలు, దద్దుర్లు వంటి వాటిని తగ్గించటంలో సహాయపడుతుంది. జీవక్రియలను ప్రోత్సహించటంతోపాటు చక్కెర పదార్దాలు తినాలన్న కోరికలను తగ్గిస్తుంది. గ్యాస్ , కడుపుబ్బరం , గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గేలా చేస్తుంది.