పాప్‌కార్న్ ఇష్టంగా తింటున్నారా..? ముందు ఈ విషయాలు తెలిస్తే..?
జొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్‌కార్న్‌లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం మొదలైనవన్నీ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఎముకల బలానికి అవసరమైన లవణాలు మక్కజొన్నలో పుష్కలం. పసుపు రంగులోని ఈ గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. అయితే ఒకప్పుడు వినోదభరితమైన సినిమా థియేటర్ ట్రీట్‌గా పరిగణించబడిన పాప్‌కార్న్ ఇప్పుడు మంచి స్నాక్ ఐటమ్ గా చెప్పబడుతుంది. అయితే పాప్‌కార్న్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా అన్న విషయం అది పాప్ చేయడానికి ఉపయోగించే నూనె,
ఏదైనా మసాలాలు జోడించడం మరియు బహుశా మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఉంటుంది. మొక్కజొన్న తృణధాన్యం. ఈ తృణధాన్యాల్లో కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,వ్యాధి పై పోరాడే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించడం, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం , ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. పాప్‌కార్న్‌లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియంలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి.
పాప్ కార్న్ తీసుకుంటే డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాప్‌కార్న్ తినేవారితో పోలిస్తే తినని వారిలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. పాప్‌కార్న్‌లో ఉండే పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును సమర్థంగా తగ్గిస్తాయి. ఫలితంగా హృద్రోగ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. పాప్‌కార్న్‌లో అధికస్థాయిలో ఉండే పీచు పదార్థాలు పేగుల పనితీరుని మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారు పాప్‌కార్న్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచుపదార్థాలు అధిక సమయం కడుపు నిండుగా ఉంచటంతోపాటుగా ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి కాకుండా ఆపుతాయి. దీని వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఫలితంగా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం. ముఖ్యంగా పాప్‌కార్న్ తయారుచేయడానికి ఉపయోగించే నూనె, వాటికి మరింత రుచి రావడానికి పైపైన జోడించే చీజ్, బటర్ వంటివి మితంగానే వాడాలి. ఇలా వాడటం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు.