సమంత లాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్.
కండరాల నొప్పి, తీవ్ర అలసటకు గురవడం, మానసిక స్థితిలో మార్పులు, నిద్ర, జ్జాపకశక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలతో పూనమ్ కౌర్ బాధపడుతోందని సమాచారం. ప్రస్తుతం పూనమ్ కౌర్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల నుంచి ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని సమాచారం.
అయితే ప్రముఖ తెలుగు నటి పూనమ్ కౌర్ తనకు ఫైబ్రోమయాల్జియా వ్యాధి నిర్ధారణ అయినట్టు ప్రకటించింది. మరో తెలుగు నటి సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. అంతలోనే పూనమ్ కౌర్ తన అభిమానులకు చేదు వార్త వినిపించింది. తాను ఫైబ్రోమయాల్జియా బారిన పడ్డట్టు పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది.
శరీరం అంతటా తీవ్రమైన నొప్పి, అలసట, డిప్రెషన్ ఫైబ్రోమయాల్జియా వ్యాధి లక్షణాలు. దీన్ని చూసిన అభిమానులు జాగ్రత్తలు తీసుకుని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ నటించిన నాతి చరామి సినిమా విడుదల కావాల్సి ఉంది.‘‘ఎన్నో ప్రణాళికలతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తిని ఫైబ్రోమయాల్జియా, నిదానించి విశ్రాంతి తీసుకునేలా చేసింది’’ అంటూ పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లో పేర్కొంది. ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. పూనమ్ కౌర్ ఆయనతో కలసి కొంత దూరంపాటు పాల్గొనడం తెలిసిందే.