ఆఫర్స్ లేకా..! అలాంటి పాత్రలు చేసేందుకు రెడీ అయిన టాప్ తెలుగు హీరోయిన్.
ఇక సినిమా ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్లతో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే.. పూజా గురించి ఓ షాకింగ్ విషయం నెట్టింట వైరల్గా మారింది. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈమెకు.. ఓ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు టాక్.
అయితే పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం అభినయంతో ఎంతో మంది అభిమానులు చూరగొన్నది. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆమెకు సినిమా ఆఫర్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండగా.. నేడు ఏ పాత్ర అయినా చేసేందుకు సిద్ధంగా ఉంది.
బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పెళ్లి కాకముందే తల్లి అవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది విన్న ఆమె ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.. ఈ విషయంలో ఆమె తల్లి దండ్రులు కూడా సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. పెళ్లి కాకముందే తల్లి కావాలనేది నిజమే కానీ.. ఇది రియల్ లైఫ్ లో కాదు.. తెరపైన మాత్రమే. దీనిపై బాలీవుడ్ లో క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం అవకాశాలు అంతగా లేని పూజాకు ఓ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కంటెంట్ నచ్చడంతో పూజా ఓకే చెప్పిందట. ఓ సినిమాలో తల్లి పాత్ర చేయడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ చేయడానికి ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తానడంతో ఓకె చెప్పిందట. అయితే ఈ విషయం పై అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఇటు బాలీవుడ్, టాలీవుడ్ లో మాత్రం టాక్ వినిపిస్తోంది.