తెలుగులో పూజా హెగ్డే ఆఫర్స్ రాకుండా చేస్తోంది ఎవరో తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా..? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు.. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు..! ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి.. పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకుని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారా..? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో..? అయితే అసలు ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ బ్యూటీకి తెలుగులో బొత్తిగా అవకాశాలు రాకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు ఈ బ్యూటీ.. అయితే మరి అసలు పూజాకు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు.
కారణం ఏంటో అని చూస్తే.. ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం.. ఆమె వచ్చిన ప్రతీ సినిమా చేయడం.. కథలో తనకు ఇంపార్టెన్స్ ఉందా.. లేదా అని చూసుకోకుండా.. కథలను సరిగ్గా ఎంచుకోకుండా.. వరుసగా చేయడంతో.. చేసిన సినిమాలన్ని పోయాయని.. దీంతో ఆమెకు ఇక అవకాశాలే రావడం లేదని వాపోతున్నారు ఆమె ఫ్యాన్స్.. దీనికి అంతటికి కారణం ఆమెనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భామ గుంటూరు కారంలో ఫస్ట్ హీరోయిన్గా ఎంపికైంది.. పూజా హెగ్డే అని తెలిసిందే.
అయితే ఏవో కారణాల వల్ల ఈ భామ ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆమె స్థానంలో శ్రీలీల చేసింది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి రావడంతో ఈ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ఆ చర్చ మొత్తం పూజా హెగ్డే చుట్టూ తిరగడం విశేషం. ముఖ్యంగా పూజా ఫ్యాన్స్, గుంటూరు కారంలో చేయకపోవడమే మంచిదైందని అంటున్నారు. హీరోయిన్స్‌కు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని ఆ సినిమాలో నటిస్తే.. ఉన్న ఆమె సినీ కెరీర్ కూడా క్లోజ్ అయ్యేదని కామెంట్స్ చేస్తున్నారు. అలా ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్లాప్ సినిమాలో పూజాహెగ్డే ఉంటే ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర ఇంకా మరింత బలంగా పడేదని,
అప్పుడిక ఆమె పూర్తిగా ఇంటికే పరిమితయ్యేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమాను చూసిన నెటిజన్స్. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డేకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే, కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారట. కథను బివియస్ రవి అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం సమంతకు వచ్చిందట. అయితే ఆమె ప్రస్తుం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండడంతో.. పూజా హెగ్డేకు ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.