దానిమ్మ తొక్క టీ తో నోటి పూత, దంత క్షయం, దంత ఫలకం, వంటి సమస్యలన్ని మటుమాయం.
దానిమ్మ తొక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దానిమ్మ తొక్క టీ తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ జ్వరం, జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దానిమ్మ తొక్కలో విటమిన్ సి ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల శరీరంలోని ప్రమాదకర టాక్సిన్లు అన్నీ బయటకు పోతాయి. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అయితే సాధారణంగా దానిమ్మ గింజలను తిని తొక్కలను డస్ట్ బిన్ లో వేసేస్తుంటాం.
కానీ ఈ తొక్కల్లో కూడా ఎనలేని ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవును ఈ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కలతో టీ తయారుచేసుకుని తాగితే కూడా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంతకు ముందు చెప్పినట్టుగా దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ టీ గొంతు నొప్పి, దగ్గు, సాధారణ జలుబును తగ్గించడానికి సహాయపడతుంది. మనలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది.. దానిమ్మలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరలోని విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
అలాగే కణాలు మరింత దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడుతుంది కూడా. శరీరం సరైన నిర్విషీకరణ రక్తాన్ని శుద్ధి చేయడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. దానిమ్మ తొక్కలల్లో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మలో ఉండే లక్షణాలు మీ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరింత సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. దానిమ్మ తొక్కల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మ ఆరోగ్యాన్నిపెంచడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే దాని పిహెచ్ సమతుల్యతను పునరుద్ధరించడానికి కూడా తోడ్పడుతుంది. దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. దానిమ్మ తొక్కలు యాంటికరీస్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి పూత, దంత క్షయం, దంత ఫలకం, వంటి అనేక దంత సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.