Health

ఈ ఆకులు రోజు రెండు తింటే చాలు నోట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటకు పోతుంది.

పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే తెలుగింటి ప్రత్యేక వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే. ఇక తేనీటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగిస్తారు.

చాలా సలాడ్స్‌లో, డెజర్ట్స్‌లో కూడా పుదీనా వాడుతారు. ఇక చాలా మంది ఫేవరైట్ అయిన బిర్యానీలో పుదీనా బాగా వాడుతారు. నాన్ వెజ్ వంటకాల్లో చాలా వరకు పుదీనా వాడతారు. కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ ఏ పుదీనాలో బాగా లభిస్తున్నందున దీనిని మీరోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనాలో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. ఇతర ఆకులు, మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి ఐబీఎస్ అనే సమస్య ఏర్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అకస్మాత్తుగా నొప్పితో విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పుదీనా మంచి ఉపశమనంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పచ్చి పుదీనా ఆకు కంటే పుదీనా ఆయిల్ ఉండే క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయని ఆ అధ్యయనాల్లో తేలింది. పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది హోమ్ రెమెడీ.

భోజనంలో పుదీనా గానీ, మింట్ ఆయిల్ గానీ ఉంటే ఈ జీర్ణ క్రియ సమస్యలన్నీ దారికొస్తాయి. బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి. చిన్నారులకు చనుబాలు పట్టే తల్లులు చనుమొనలు పగిలినప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు పుదీనా రసం రాస్తే నయం అవుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది. ముక్కు నుంచి శ్వాస ఆడలేని పరిస్థితిలో పుదీనా డీకంజెస్టెంట్‌గా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

నోట్లో ఉన్న బ్యాక్టీరియాను మట్టుబెట్టి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే విటమిన్లు, యాంటాక్సిడెంట్ల మీ రోగనిరోధకతను పెంపొందిస్తాయి. పుదీనా ఆకుల్లో ఉండే సెలిసైక్లిక్ యాసిడ్, విటమిన్ ఏ కారణంగా మొటిమలను నియంత్రించగలుగుతుంది. ఇదొక క్లెన్సర్‌గా, మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. పుదీనా ఆకుల్లో ఉండే కెరోటీన్, యాంటాక్సిడంట్లు మీ జుట్టు పెరిగేలా సాయపడడంతోపాటు, జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు పేలను, చుండ్రును తొలగిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker