Health

పీరియడ్స్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..?

ఈ రోజుల్లో మహిళలకు అసౌకర్యాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. రుతుక్రమం సమయంలో తరచుగా న్యాప్‌కిన్‌లు లేదా మెన్‌స్ట్రువల్ కప్పులను మార్చడం ,సూక్ష్మక్రిములను నివారించడానికి అదనపు పరిశుభ్రత చర్యలను అనుసరించడం. అయితే మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. సాధారణంగా ఋతు చక్రం 21 నుండి 35 రోజులు ఉంటుంది. అయితే, అందరు మహిళల్లో ఋతు చక్రం ఒకేలా ఉండదు. భిన్నంగా ఉంటుంది.

కొంతమంది స్త్రీలకు 28 రోజుల తర్వాత, మరికొందరికి 30 రోజుల తర్వాత పీరియడ్స్ రావచ్చు. పీరియడ్స్ టైమ్ 28 రోజులు అయితే, మరుసటి నెలలో ఒకటి లేదా రెండు రోజుల ఆలస్యంగా పీరియడ్స్ వస్తున్నట్లయితే.. దానిని లేట్ పీరియడ్స్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. ఇక 40 రోజుల పాటు పీరియడ్స్ రాకపోతే.. మిస్డ్ పీరియడ్స్‌గా పరిగణించాలంటున్నారు. విపరీతమైన ఒత్తిడి..ఒత్తిడి కారణంగా కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లయితే.. అది శరీర వ్యవస్థను సమతుల్యం చేసే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా, పునరుత్పత్తి హార్మోన్లలో సమస్య ఏర్పడుతుంది.

    అందుకే ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. అధిక బరువు..సాధారణం కంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల పీరియడ్స్ టైమ్‌పై ప్రభావితం చూపుతుంది. శరీరంలో కొవ్వు శాతం పెరగడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల పీరియడ్స్ మిస్ అవుతాయి. మితిమీరిన డైటింగ్ కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. PCOS కారణాలు..పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పిసిఒఎస్) వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. ప్రస్తుత కాలంలో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది.

    దీని కారణంగా పీరియడ్స్ సమయంలో రక్తస్త్రావం అధికంగా గానీ, తక్కువగా గానీ ఉంటుంది. మధుమేహం..చాలా సందర్భాలలో మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు పెరగడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు అనేక మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా పీరియడ్స్ లేట్ అవుతుంటుంది. గర్భనిరోధక మాత్రల వినియోగం..చాలా మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇది కూడా పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సలహా లేకుండా ఈ మాత్రలు అస్సలు తీసుకోవద్దు.

    Related Articles

    Back to top button

    Adblock Detected

    Please consider supporting us by disabling your ad blocker