భారత్లోనే ఈ గ్రామంలో పెళ్లి తర్వాత వధువు వారం రోజులు దుస్తులు ధరించదు..!
హిమాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామంలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అక్కడ కొత్తగా పెళ్లైన వధువు వివాహం తర్వాత మొదటి వారం రోజులు ఎటువంటి దుస్తులు ధరించకూడదు. ఈ సమయంలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరికొకరు దూరంగా ఉంటారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివాహానికి విభిన్న సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని చోట్ల పెళ్లి తర్వాత బట్టలు చింపుకునే ఆచారం ఉంటే.. మరికొన్ని చోట్ల వధూవరులను వేర్వేరు గదుల్లో ఉంచే ఆచారం ఉంది. అయితే ఇప్పుడు మనం పూర్తి భిన్నమైన సంప్రదాయం గురించి తెలుసుకోబోతున్నాం.
హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలోని పిని గ్రామ ప్రజలు వివాహానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడ పెళ్లి చేసుకున్న మహిళలు సంవత్సరంలో 5 రోజులు ఎలాంటి దుస్తులు ధరించరు. భార్యభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు గానీ.. ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇద్దరూ ఎవరికి వారే తెలియనట్టుగా ఉంటారు. ఈ 5 రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ల ముందుకి రారు, ఇంట్లో తాళం వేసి ఉండరు, నవ్వరు కూడా. ఇంటి పని నుంచి ప్రతి పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు.
ఇలా చేయకపోతే వారికే కాదు.. గ్రామానికి కూడా అరిష్టమని, కీడు జరుగుతుందని నమ్ముతారు. ఇదొక్కటే కాదు.. పురుషులు కూడా ఈ సమయంలో మద్యం సేవించరు. వారితో అస్సలు మాట్లాడరు, చూసి నవ్వుకోరు, మాంసం తినడం ఆ ఐదు రోజులు మానేస్తారు. పూర్వం పిని గ్రామంలోకి ఓ రాక్షసుడు వచ్చి చక్కగా బట్టలు వేసుకున్న పెళ్లైన స్త్రీలను తీసుకెళ్లేవాడట. అందమైన బట్టలు వేసుకున్న ఏ స్త్రీనైనా తీసుకుని వెళ్లి చిత్రహింసలు పెట్టేవాడట.
చివరికి లాహు ఘోండ్ దేవత రాక్షసుడిని చంపి స్త్రీలను రక్షించారట. అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ దేవత రాక్షసుడిని వధించిన సందర్భాన్ని ఈ గ్రామప్రజలు పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ సంప్రదాయంలో కాలక్రేమణా కొంచెం మార్పు వచ్చి.. ఆ 5 రోజులు మహిళలు సన్నని ఉన్ని బట్టలు ధరించి.. వాటిని మార్చేవారు కాదట.