Health

ఈ ఉప్పుతో బీపీ సమస్య పూర్తిగా తగ్గి, షుగర్‌ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది.

గులాబీ రంగు రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో ఈ ఉప్పును తయారు చేస్తారు. దీన్ని ‘పింక్ సాల్ట్’ అని కూడా పిలుస్తారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు. హిమాలయా పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి ఈ ఉప్పును తయారు చేస్తారు. సాధారణ ఉప్పులా కాకుండా.. ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది.

అయితే మసాలా, ఉప్పు, మిరియాలు, గరం మసాలా ప్రతి భారతీయ వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలు. అన్నింటికంటే, ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. ఎలాంటి ఉప్పు మంచిదో, ఎంత మేలు చేస్తుందో తెలుసుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే, సుగంధ ద్రవ్యాలు లేకుండా భారతీయ భోజనం దాదాపు అసంపూర్ణంగానే ఉంటుంది. వీటితో పాటు ఉప్పు చాలా ముఖ్యం.

సాధారణంగా రెండు మూడు రకాల ఉప్పులను వంటలో ఉపయోగిస్తారు. ఉప్పులో బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అనే మూడు రకాలున్నాయి. వీటిలో, రాతి ఉప్పు లేదా సాధారణ ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ మూడింటిలో పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం తగినంతగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. పింక్ కలర్ ఉప్పులో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే పోషకాలు ఊబకాయం సమస్యను అధిగమించడంలో సహాయపడతాయి.

అంతేకాదు మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పులో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిక్ రోగులకు గులాబీ ఉప్పు చాలా మంచిది, సురక్షితం కూడా.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker