రూపాయి ఖర్చు లేకుండా మీ మొఖంపై మొటిమల సమస్యకు అద్భుతమైన వంటింటి చిట్కాలు.
పింపుల్స్ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ వస్తాయి. ముఖంపైనేకాకుండా చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. మొటిమలు వచ్చి తగ్గిపోయిన తరువాత కొందరికి ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. మరికొందరికి గుంటలు, గుంటలుగా పడతాయి. అవి తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటుంది. వీటి వల్ల మొఖాన్ని ఎదుటివారికి చూపించలేని పరిస్ధితి ఉంటుంది. అయితే చర్మం పై పొరలోని రంధ్రాలలో జిడ్డు పేరుకుపోయినప్పుడు వాటిలో బ్యాక్టీరియా చేరి ముఖంపై మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి.
సాధారణంగా చర్మాన్ని లూబ్రికేట్ చేయడానికి ఈ రంధ్రాల ద్వారా సెబేషియస్ ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఈ ద్రవం గడ్డకట్టి ఆగిపోతే, అది మొటిమ రూపంలో చర్మం కింద కొవ్వగా గట్టిపడి మొటిమల రూపాన్ని తీసుకుంటుంది. మొటిమలను ఎలా తొలగించాలి.. ఇప్పుడు మొటిమలను ఎలా తొలగించాలో తెలుసుకుందాం. మొటిమలను తొలగించడానికి మార్కెట్లో అనేక క్రీములు లోషన్లు అందుబాటులో ఉన్నాయి. మొటిమలను తొలగించే ప్రక్రియలో రసాయనాలతో తయారు చేసిన క్రీములు, లోషన్లను ఉపయోగించడం ద్వారా చాలాసార్లు యువత తమ ముఖాలను పాడు చేసుకుంటున్నారు. మొటిమలను తొలగించడానికి ఇంటి చిట్కాలు..
టమోటాతో మొటిమలను ఎలా తొలగించాలి.. మొటిమలను తొలగించడానికి టొమాటో రసం మొదటి మార్గం. ఇది మన వంటగదిలో సులభంగా దొరుకుతుంది. టొమాటోలు చాలా మంచి క్లెన్సర్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంపై మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ముందుగా ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల టొమాటో రసాన్ని తీసుకుని అందులో ఒక చెంచా తేనె, అర చెంచా బేకింగ్ సోడా వేసి పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మొటిమల మీద అప్లై చేసి, ముఖం ఆరిన తర్వాత, చల్లని పాలతో ముఖాన్ని మర్దన చేస్తూ, శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.
మీ మొటిమలు 24 గంటల్లో మాయమవుతాయి. పసుపుతో మొటిమలను తొలగించే రెమెడీ.. మొటిమలను తొలగించడానికి పసుపు మరొక ఔషధం. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా మొటిమలు మచ్చలు ముఖం నుండి సులభంగా తొలగిపోతాయి. పసుపుతో మొటిమలను తొలగించడానికి, మీరు మొదట దాని పేస్ట్ తయారు చేయాలి. దీని కోసం, పాలు రోజ్ వాటర్‌లో ఒక చెంచా పసుపు పొడిని కలిపి పేస్ట్ చేయండి.
ఇప్పుడు ఈ పేస్ట్‌ను నేరుగా మొటిమలపై అప్లై చేయండి. ఈ రెమెడీని కొన్ని రోజులు కంటిన్యూగా చేయడం వల్ల మొటిమల సమస్య తీరిపోతుంది. కలబందతో మొటిమలను తొలగించే మార్గాలు.. అలోవెరా జెల్‌తో కూడా మొటిమలను పోగొట్టుకోవచ్చు. మొటిమలు, మచ్చలపై కలబంద జెల్‌ను రాసి, ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, అలోవెరాను సాధారణంగా మార్కెట్‌లో లభించే చాలా బ్యూటీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. కొద్ది రోజుల్లోనే మీ మొటిమలు మొటిమలు నయమవుతాయి.