Health

పైల్స్ సమస్య ఎక్కువగా ఎలాంటి వారికీ వస్తాయో తెలుసా..?

పైల్స్‌ మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. ఈ మొలలనే హేమోరాయిడ్స్ అని వైద్య పరిభాషలో అంటారు. అయితే పైల్స్ ను తగ్గించడంలో ఆహారం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫైబర్స్, ఆకుపచ్చకూరగాయలు, పండ్లు, నీటిని తక్కువగా తీసుకోవడం వల్లే పైల్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైట్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల కూడా పైల్స్ వస్తాయి.

ఇలాంటి ఆహారాల వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేయదు. నీటిని తక్కువగా తాగడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. కాఫీ కూడా పైల్స్ రావడానికి మరొక కారణం. ఎందుకంటే కాఫీని ఎక్కువగా తాగడం వల్ల పేగుకదలికలు నెమ్మదిస్తాయి. ఇక ఇప్పటికే పైల్స్ ఉంటే అవి మరింత పెరిగే అవకాశం ఉంది. మలబద్దకం, దీర్ఘకాలిక పేగు కదలికలతో బాధపడేవారు పైల్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. పైల్స్ తో బాధపడేవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే..

పైల్స్ సమస్యతో బాధపడేవారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబరర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే నీటిని పుష్కలంగా తాగాలి. పైల్స్ ట్రీట్ మెంట్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం.. పైల్స్ తో బాధపడుతున్న వాళ్లు చిక్కుళ్లను ఎక్కువగా తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. పైల్స్ వల్ల ఏర్పడే చికాకు, వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు కూడా పైల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి.

వీళ్లు స్పైసీ ఫుడ్స్ ను అసలే తీసుకోకూడదు. బ్రోకలీ, చిలగడదుంపలు, టర్నిప్స్, క్యారెట్లు కూడా వీళ్ల ఆరోగ్యానికి మంచివి. పైల్స్ చికిత్స.. అయితే చాలా మంది పైల్స్ ను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలనే ఫాలో అవుతుంటారు. కానీ ఇంటి నివారణలు శాశ్వత ఉపశమనాన్ని అందించవు. ఇవి కేవలం పైల్స్ తీవ్రతను మాత్రమే తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే పైల్స్ వల్ల కలిగే నొప్పిని, అసౌకర్యాన్ని తాత్కాలికంగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker