పులిపిర్లు ఎటువంటి నొప్పి లేకుండా రాలిపోయే చిట్కాలు.
చర్మ శుభ్రత పాటించని వారిలో పులిపుర్ల ఏర్పడటానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. మొహం, మెడ, గొంతు భాగాలు సరిగా రుద్దక పోవటం వల్ల మురికి పొరలుగా అట్టులుకట్టి, నల్లగా మారి మందంగా, వికృతంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో పులిపిర్లు ఏర్పడతాయి. అయితే ఈ పులిపిర్లు ఎక్కువ రాబడి ఉన్నా మన శరీర భాగాలపై వస్తూ ఉంటాయి.
మన ఇంటి చిట్కాల ద్వారా కానీ వైద్యులను సంప్రదించడం ద్వారా కానీ వీటిని మన శరీర భాగం నుంచి తొలగించవచ్చు. ఆపిల్ సీడర్ వెనిగర్ కూడా పులిపిర్ల నివారణకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఆపిల్ వెనిగర్ లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల ఇవి సహజంగానే తగ్గిపోతాయి. ఆపిల్ వెనిగర్ లో దూదిని ముంచి పులిపిర్లు ఉన్నచోట రుద్దితే వారం తిరగకుండానే అవి తగ్గిపోతాయి.
కలబంద కూడా పులిపిర్ల నివారణకు పని చేస్తుంది. కలబంద లో ఉండే మెలిక్ ఆసిడ్ పులిపిర్లలో ఉండే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద జిగురుని వాటిపై రాస్తే చాలు అవే తగ్గిపోతాయి. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకొని ఆముదంలో కలిపి పులిపిర్లు ఉన్నచోట రాసి ఒక బ్యాండేజ్ తో గాని లేదా ఒక మృదువైన గుడ్డతో గాని దానిపై కట్టు లాగా కట్టేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు తగ్గుముఖం పడతాయి.
అరటి తొక్క కూడా పులిపిర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్కని రోజు పులిపిర్లు ఉన్న చోట రాస్తే అవే తగ్గిపోతాయి. వెల్లుల్లి కూడా పులిపిర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ఎల్లిసీన్ పులిపిర్లలో ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. వెల్లుల్లి మెత్తగా నూరి ఒక ముద్దలా చేసి పులిపిర్లు ఉన్నచోట క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే కచ్చితంగా అవి తగ్గి మంచి ఫలితం వస్తుంది.