Health

దిండు కవర్లను వారానికోసారి ఉతకకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

ఒక వారం కంటే ఎక్కువ కాలం ఉతకని పిల్లో కవర్లు, బెడ్ షీట్లలో మూడు మిలియన్ల నుంచి ఐదు మిలియన్ల వరకు బ్యాక్టీరియా ఉంటుంది. ఒక ఉతకని దిండులో ఒక వారంలో 3 మిలియన్ బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఇది సగటు టాయిలెట్ సీటు కంటే 17,000 రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. బాత్ రూం డోర్ హ్యాండిల్స్ కంటే దిండులపై 25,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు అధ్యయనం కనుగొంది. అయితే మన ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు మంచి పోషకాలున్న ఆహారంతో పాటు ప్రతి రోజు వ్యాయామం, ధాన్యం చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇక చర్మం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. దీని వల్ల చర్మవ్యాధులతో పాటు ఇతర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. ఇక అందమైన చర్మం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. వివిధ రకాల ఖరీదైన ఉత్పత్తులు, ఇంట్లో తయారుచేసిన పేస్ట్‌లు, ఫేస్ మాస్క్‌లను ఉపయోగిస్తారు. అయితే చాలా సార్లు చర్మ సమస్యలు మాత్రం తగ్గవు.

అందు కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కాస్మోటాలజిస్ట్, చర్మ సంరక్షణ నిపుణులు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. దీనిలో చర్మ సంరక్షణ కోసం పరిశుభ్రతకు సంబంధించిన కొన్ని మార్పులను వెల్లడించారు. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తడానికి దిండ్లు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. దిండు శుభ్రపరచడంపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. తలకింద వేసుకునే దిండు వల్ల కూడా చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

ప్రతి వారం పిల్లో కవర్లను మార్చుకోవాలని గీతికా మిట్టల్ చెబుతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, మీరు ప్రతి వారం దిండు కవర్‌ను మార్చడం ప్రారంభించినప్పుడు, మీ చర్మంలో విభిన్నమైన మార్పు కనిపిస్తుంది. ఈ స్కిన్ హ్యాక్ గురించి మీకు తెలియకపోతే, మీరు ప్రతిరోజూ డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతో నిద్రపోయే అవకాశం ఉంది. వారానికోసారి మీ దిండు కవర్‌ని మార్చుకోవడం వల్ల చర్మానికి మంచిదని స్కిన్‌కేర్ నిపుణులు అంటున్నారు.

దిండు కవర్, చర్మం మధ్య సంబంధం ఏమిటి..గీతిక పోస్ట్‌లో ఒక రేఖాచిత్రాన్ని కూడా చూపించింది. ఈ రేఖాచిత్రంలో పిల్లో కవర్‌లో దుమ్ము కణాలు, ధూళి, నూనె, పెంపుడు జంతువుల జుట్టు, చనిపోయిన చర్మం, బ్యాక్టీరియా వంటి అనేక హానికరమైన పదార్థాలు ఎలా ఉంటాయో చూపించాడు. మీరు సరైన స్కిన్‌కేర్ రొటీన్‌ని అనుసరించినప్పటికీ, ఇవన్నీ స్కిన్ బ్రేక్‌అవుట్‌లకు దారితీస్తాయి. సిల్క్ పిల్లో కేసులు ఉపయోగించడం వల్ల చర్మాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో కూడా ఆయన తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker