నొప్పిలేకుండా పులిపిర్లు శాశ్వతంగా తొలగించే సూపర్ చిట్కాలు.
ప్రస్తుత కాలంలో ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పులిపిర్ల సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని ఉలిపిరి కాయ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా చెవి, మెడ భాగంలో వస్తూ ఉంటాయి. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఇవి వస్తూ ఉంటాయి. మన శరీరంలో కలిసిపోయే కొన్ని పులిపిర్ల వల్ల మనకు ఎలాంటి బాధ కలగదు. కానీ కొన్ని పులిపిర్లు ఎక్కువ బాధని మన శరీరానికి కలగజేస్తాయి. కొన్ని పులిపిర్లు చేతి వెళ్లే మధ్య భాగంలో ముఖంపై కూడా వస్తూ ఉంటాయి.
మరికొంతమందిలో జననంగాలపై కూడా వస్తూ ఉంటాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీన పడినప్పుడు కొన్ని వైరస్ లు మన శరీరం పై దాడి చేసినప్పుడు ఈ పులిపిర్లు ఏర్పడతాయి. కొంతమంది ఈ పులిపిర్లను కత్తిరించడం కాల్చడం ఒంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ పులిపిర్లు ఎక్కువ రాబడి ఉన్నా మన శరీర భాగాలపై వస్తూ ఉంటాయి. మన ఇంటి చిట్కాల ద్వారా కానీ వైద్యులను సంప్రదించడం ద్వారా కానీ వీటిని మన శరీర భాగం నుంచి తొలగించవచ్చు.
ముఖ్యంగా ఈ ఐదు చిట్కాలను పాటించి పులిపిర్ల నివారణ చేయవచ్చు. ఆపిల్ సీడర్ వెనిగర్ కూడా పులిపిర్ల నివారణకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఆపిల్ వెనిగర్ లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల ఇవి సహజంగానే తగ్గిపోతాయి. ఆపిల్ వెనిగర్ లో దూదిని ముంచి పులిపిర్లు ఉన్నచోట రుద్దితే వారం తిరగకుండానే అవి తగ్గిపోతాయి. కలబంద కూడా పులిపిర్ల నివారణకు పని చేస్తుంది. కలబంద లో ఉండే మెలిక్ ఆసిడ్ పులిపిర్లలో ఉండే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద జిగురుని వాటిపై రాస్తే చాలు అవే తగ్గిపోతాయి.
కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకొని ఆముదంలో కలిపి పులిపిర్లు ఉన్నచోట రాసి ఒక బ్యాండేజ్ తో గాని లేదా ఒక మృదువైన గుడ్డతో గాని దానిపై కట్టు లాగా కట్టేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు తగ్గుముఖం పడతాయి. అరటి తొక్క కూడా పులిపిర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్కని రోజు పులిపిర్లు ఉన్న చోట రాస్తే అవే తగ్గిపోతాయి. వెల్లుల్లి కూడా పులిపిర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ఎల్లిసీన్ పులిపిర్లలో ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. వెల్లుల్లి మెత్తగా నూరి ఒక ముద్దలా చేసి పులిపిర్లు ఉన్నచోట క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే కచ్చితంగా అవి తగ్గి మంచి ఫలితం వస్తుంది.