ఈ చిట్కాలతో 3రోజుల్లోనే పైల్స్ సమస్య నుండి ఉపశమనం పొందుతారు.
మారుతోన్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా షిప్ట్‌ల్లో పనిచేసే వారు, ఆహారం తీసుకునే సమయాల్లో ఒక పద్ధతి పాటించని వారు, గంటల తరబడి కూర్చోవడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, ఇలా రకరకాల కారణంగా పైల్స్ సమస్య వేధిస్తుంటుంది. అయితే ప్రస్తుతం పైల్స్ సమస్యలు సర్వసాధరణమయ్యాయి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పైల్స్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యును సంప్రదించాలి.
లేకపోతే తీవ్ర నొప్పి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావొచ్చు. పైల్స్ ఉన్నవారు కేవలం ఇలాంటి ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. టీ-కాఫీ తీసుకోవడం తగ్గించండి.. టీ-కాఫీలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల తీవ్ర పైల్స్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
టీ, కాఫీలలో అధిక పరిమాణంలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పైల్స్ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బేకరీ పదార్థాలను తినొద్దు..బేకరీలో చేసిన కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దీని కారణంగా జీర్ణవ్యవస్థ ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో పైల్స్ వ్యాధి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ కూరగాయలు తినడం మానుకోండి.. గ్యాస్-ఎసిడిటీ, అజీర్ణం, త్రేనుపు సమస్యను పెంచే కూరగాయలు తీసుకోవడం మానుకోవాలి. క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బంగాళదుంప, క్యాబేజీ వంటి కూరగాయలు అస్సలు తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది.
దీంతో పైల్స్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాన్ని తినొద్దు.. వేయించిన ఆహారాలు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా వేయించిన ఆహారాలు తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటి వల్ల కొన్ని సార్లు పైల్స్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.