పచ్చళ్లు ఎక్కువ తినే మగవారికి అలర్ట్, ఆ సామర్థ్యం తగ్గిపోతుంది.
శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, నూనెతో ఊరగాయలను తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. అయితే పచ్చళ్లు అంటే కొంత మందికి చాలా ఇష్టం. రోజూ పచ్చడి లోనిదే భోజనం ప్రారంభించరు. కొంత మంది పెరుగన్నాన్ని చట్నీతో కలిపి తింటారు. ఇక మందు బాబులైతే… మద్యం తాగుతూ… పచ్చడిని అలా అంటించుకుంటారు. ఇలా… పచ్చడితో మన తెలుగు వారికి సంబంధం చాలా ఎక్కువే ఉంటుంది.
మాంసాహార ప్రియులైనా, శాఖాహార ప్రియులైనా… ఎవరైనా సరే… ఏవో ఒక పచ్చళ్లు తినడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా మామిడికాయ పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. కొంత మంది టమాటా చట్నీ, మరికొందరు ఎండుమిర్చి అంటే ఇష్టపడతారు. ఇక చికెన్ చెట్నీలు, మటన్ చెట్నీలు కూడా ఈ రోజుల్లో ఉంటున్నాయి. ఇలా… ఎక్కువ ఉప్పు, నూనెతో… ఆహార పదార్థాల్ని నిల్వ ఉంచే ఆచారం శతాబ్దాలుగా ఉంది. సాధారణంగా పచ్చడి తయారుచేసేటప్పుడు దానికి నూనె లేదా వెనిగర్ కలుపుతారు. పండైనా, కాయగూర పచ్చడైనా అయినా… ఆయిల్ లేదా వెనిగర్ కలిపితే… దానికి లాక్టిక్, సిట్రిక్, ఎసిటిక్ యాసిడ్లు కలుస్తాయి.
ఈ మూడు యాసిడ్లూ… మన శరీరానికి మేలు చేస్తాయి. ఇవి మన శరీరం పటిష్టంగా, యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. మన పొట్టలో ఇవి మైక్రోబ్స్‌లాగా పనిచేస్తాయి. ఫలితంగా… పచ్చళ్లు తినడం వల్ల మన బాడీలో జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. బాడీలో మెటబాలిజం మెరుగవుతుంది. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. పచ్చళ్లలో నూనె లేదా వెనిగర్ మాత్రమే వెయ్యరు. అదనంగా ఉప్పు, కారం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలు కూడా వేస్తారు. తద్వారా పచ్చడికి యాంటీఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ కలుస్తాయి. తరచూ పచ్చళ్లు తినేవారిలో… ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పరిశోధనలు తెలిపాయి. అయితే, కొన్ని పరిశోధనలు పచ్చళ్లు ప్రమాదకరం అని కూడా చెబుతున్నాయి.
పచ్చళ్లలో ఎక్కువగా క్యాలరీలు ఉండవు. అందువల్ల పచ్చడితో భోజనం చేసిన వారికి ఎనర్జీ సరిపోదు. పైగా పచ్చళ్లు త్వరగా అరిగేలా చేస్తాయి. కాబట్టి మళ్లీ త్వరగా ఆకలి వేసేలా చేస్తాయి. అందువల్ల పచ్చడితో తినేవారు… ఆ తర్వాత ఆకలేసి… అనారోగ్యకరమైన ఇతర ఆహార పదార్థాలు, స్నాక్స్ వంటివి ఎక్కువగా తినే ప్రమాదం ఉందంటున్నాయి కొన్ని పరిశోధనలు.అలాగే, పచ్చళ్లు ఎక్కువగా తింటే పురుషులు పలు సమస్యలను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చళ్లలో అష్టమిప్రిడ్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది. మీ లైంగిక జీవితానికి ఆటంకం కలిగించే పదార్థం కావున పరిమిత పరిమాణంలో మాత్రమే ఊరగాయలను తినండి. ఎక్కువగా తింటే లైంగిక జీవితంలో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మగవారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.