Health

ఈ పనులు చెయ్యకుండా ఉంటె మీ పేగులు క్లీన్ గా ఆరోగ్యంగా ఉంటాయి.

పేగులు ఆరోగ్యంగా ఉన్నట్టయితే తినే ఆహారం చక్కగా జీర్ణమై అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందుకు అవసరమైన మంచి బ్యాక్టీరియా పేగుల్లోనే ఉంటుంది. హానికారకాలు బయటకు పంపేందుకు, వ్యాధులపై పోరాడేందుకు పేగులు ఆరోగ్యంగా ఉండాలి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా లోపించినప్పుడే ఆహారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మంచి బ్యాక్టీరియా లోపిస్తే కొన్ని రకాల పదార్థాలు సరిగ్గా జీర్ణం కావు. ఇది ఆయా పదార్థాల పట్ల అయిష్టానికి దారితీస్తుంది.

కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా, తల తిగరడం, కడుపులో నొప్పి ఇవన్నీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగినంత లేదనడానికి లక్షణాలుగా చూడొచ్చు. పేగులు ఆరోగ్యం లేకపోవడం వల్ల అలసట కూడా కనిపిస్తుంది. అయితే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే పేగులు సరిగ్గా పని చేయవు. పేగుల ఆరోగ్యం మనం తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకోండి. కొన్ని ఆహార పదార్థాలు మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తాయి.

ఫ్రై చేసిన ఆహారం:
ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కడుపులో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి. మాంసం.. మాంసం కూడా పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పాల ఉత్పత్తులను తీసుకోవడం మాంసాన్ని తీసుకోవడం వలన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా తొలగిపోతుంది. పేగుల్లో మంట కూడా వస్తుంది. మైదా..మైదాని తీసుకోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది.

మైదాలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది కూడా. పంచదార.. పంచదారని ఎక్కువ తీసుకోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. మీరు మీ పేగులని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పంచదారకు దూరంగా ఉండటం మంచిది.

ప్రోబయోటిక్స్.. శరీరానికి సరిపడా ప్రోబయోటిక్స్ ని తీసుకోకపోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం పాడవుతుంది. యాంటీబయటిక్స్.. ఎక్కువ యాంటీబయటిక్స్ ని తీసుకోవడం వలన పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే గుడ్లు ఎక్కువ తీసుకోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం తాగడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. చేతులారా మీరు మీ పేగుల ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker