Health

ఈ క్యాన్సర్ ఆడవారి కంటే మగవారికే గా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

పొట్టకింద నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఉంటాయి. రక్తం వల్ల మలం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి, బలహీనత, అలసట కనిపిస్తాయి. శరీరం బరువు తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి. అయితే ఈ క్యాన్సర్​ను గుర్తించడానికి వైద్యులు వివిధ దశల ద్వారా గుర్తిస్తారు. ఆ దశలకు అనుగుణంగా చికిత్సలు చేస్తారు. ఇది వారి చికిత్స ప్రణాళికను నిర్ణయించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో 5 దశలు ఉంటాయి. మొదటి దశను కార్సినోమా ఇన్​ సిటు అని పిలుస్తారు. ఈ దశలో అసాధారణ కణాలు పెద్దపేగు లేదా పురీషనాళం లోపలి పొరల్లో మాత్రమే ఉంటాయి.

తర్వాతి దశలంలో క్యాన్సర్ పెద్ద పేగు లేదా పురీషనాళంలోని లైనింగ్ లేదా శ్లేష్మ పొరలోకి చొచ్చుకుపోయి కండరాల పొరలోకి పెరిగి పోతుంది. ఇది సమీపంలోని శోషరస కణుపులకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. మూడో దశలో క్యాన్సర్ పెద్ద పేగు లేదా పురీషనాళం గోడలకు కణజాలాలను వ్యాపిస్తుంది. కానీ శోషరస కణుపులను ప్రభావితం చేయదు. నాల్గొవ దశలో క్యాన్సర్ శోషరస కణుపులను ఇస్తుంది కానీ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించదు. చివరి దశలో క్యాన్సర్ కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:-పెద్దపేగు క్యాన్సర్​ లక్షణాలు ప్రారంభదశలో గుర్తించడం కష్టం. కానీ తర్వాత మలబద్ధకం, అతిసారం, మలం రంగులో మార్పులు, మలంలో రక్తం, పురీషనాళం నుంచి రక్తస్రావం, కడుపు ఉబ్బరం, తిమ్మిరి, పొత్తి కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి. అలసట, బలహీనతం, బరువు తగ్గడం, నెలకంటే ఎక్కువ కాలం మలంలో మార్పులు, పేగులు నిండుగా ఉన్న భావన, వాంతులు కూడా వీటి లక్షణాలే. కాలేయం, ఊపిరి తిత్తులకు క్యాన్సర్ వ్యాపిస్తే కామెర్లు, చేతులు, కాళ్లలో వాపు, శ్వాసలో ఇబ్బందులు, దీర్ఘకాలిక తలనొప్పివంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు:-పెద్దపేగు క్యాన్సర్​కు గల కారణాలపై పరిశోధకులు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. ఇది జన్యు ఉత్పరివర్తనాల వల్ల సంభవించవచ్చు. వారసత్వంగా కూడా రావొచ్చు. వీటివల్లే క్యాన్సర్ వస్తుందని చెప్పలేము కానీ.. వీటి వల్ల వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రమాద కారకాలు:-కొన్ని కారకాలు పెద్దపేగు క్యాన్సర్​ను అభివృద్ధి చేస్తాయి. మీ వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటివి పెద్ద పేగు క్యాన్సర్ మీద ప్రభావం చూపిస్తాయి. 50 ఏళ్లు కంటే ఎక్కువ వయసు, పేగు వ్యాధులు, కొలొరెక్టల్​ క్యాన్సర్, జన్యుపరమైన సిండ్రోమ్​లు కలిగి ఉండటం వంటివి ప్రమాదకారకాలుగా చెప్పవచ్చు.

అధిక బరువు, ఊబకాయం, ధూమపానం, మద్యపానం విపరీతంగా చేయడం, డయాబెటిస్ టైప్​ 2, నిశ్చలమైన జీవన శైలిని ఈ క్యాన్సర్​ను ప్రభావితం చేస్తుంది. నివారణ:-పెద్దపేగు క్యాన్సర్​ను జీవనశైలిలో మార్పులతో నివారించవచ్చు. లేదంటే ఈ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెడ్ మీట్​కి దూరంగా ఉంటూ.. ప్రాసెసె చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. మొక్కల ఆధారిత ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించడం, వ్యాయామం చేయడం, మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచుకోవడం, బరువు తగ్గడం, స్మోకింగ్-డ్రింకింగ్ వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ అదుపులో ఉంటుంది. పలు చికిత్సలతో దీనిని కంట్రోల్ చేయవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker