News

21 ఏళ్లకే నాకు ఆ మొదటి అనుభవం అయిపోయింది అంటూ పాయల్ షాకింగ్ పోస్ట్.

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ ఎక్స్ 100 మూవీలో పాయల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. రవితేజ, వెంకటేష్ వంటి స్టార్స్ పక్కన నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా నిరాశపరిచింది. ఆ చిత్రంలో పాయల్ మూగ అమ్మాయి పాత్ర చేసింది. అయితే తన తొలి రోజులను గుర్తు చేసుకుంది పాయల్. తన మొదటి ఫోటో షూట్ అనుభవాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అమ్మడు.

‘21 ఏళ్లకు ఈ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. గ్రేహ శోభా అనే ఓ మ్యాగజైన్ కోసం తొలి ఫోటో షూట్ చేయించుకున్నా. ఢిల్లీలో ఫోటో షూట్. ఆ తర్వాత ముంబయికి షిఫ్ట్ అయ్యా. ఆ తర్వాత టీవీ రంగంలో కెరీర్ ప్రారంభించా’ అని ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అందులో మోడ్రన్ లుక్స్‌లో కట్టిపడేస్తుంది పాయల్. నాజూగ్గా కనిపిస్తోంది లేడీ. అలనాటి సంగతులను నెమరు వేసుకుంది. పలు పిక్స్ షేర్ చేసుకుంది.

అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోడల్ నుండి టీవీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ భామ. పలు సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌లో నటించింది. 2017లో చన్నా మేరియా అనే పంజాబీ మూవీతో వెండితెరపై వెలిసిన ఈ అందం..బాలీవుడ్ ఇంట అడుగుపెట్టింది. వీర్ కీ వెడ్డింగ్ సినిమాతో ఆమె క్లిక్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు నాట అడుగుపెట్టడం.. ఇక్కడ ప్రభంజనం సృష్టించడం చక చకా జరిగిపోయాయి.

ఓటీటీ వేదికగా కూడా మూవీస్ చేసింది పాయల్. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker