News

పవన్ కళ్యాణ్ నడుపుతున్నఈ బైక్ ధర తెలిస్తే షాక్ అవుతారు.

పవన్ కళ్యాణ్ కృష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా.. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే 17వ శతాబ్దపు పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతున్న ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేంటి ‘హరిహర వీరమల్లు’ సినిమా పీరియాడిక్ డ్రామా కదా పవన్ కళ్యాణ్ బైక్ ఎందుకు నడుతున్నాడు అని కన్ఫ్యూస్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ బైక్ నడిపింది, షూటింగ్ కోసం కాదండి షూటింగ్ లో… పవన్ కళ్యాణ్ సరదాగా కాసేపు సెట్స్ లో బైక్ వేసుకోని తిరిగాడు.

ఈ సమయంలో కొన్ని ఫోన్స్ క్లిక్ మనడంతో, ఆ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. బ్లాక్ టిషర్ట్ లో బైక్ నడుపుతున్న ఫోటో ఒకటి, ‘హరిహర వీరమల్లు’ గెటప్ వేసుకోని రెడ్ డ్రెస్ లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతున్నాయి. పవన్ నడుపుతున్నది BMW R1250 GS మోడల్ కు చెందిన ఈ బైక్ ధర అక్షరాలా 24 లక్షలు. ఈ రేటు తెలియగానే అందరూ షాక్ అవుతున్నర్రు. అయితే పవన్ కళ్యాణ్ కి బైక్స్ అన్నా, గన్స్ అన్నా చాలా ఇష్టమని ఆయన సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.

ఇదిలా ఉంటే ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రస్తుతం ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రీఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కార్డ్ పడే వరకూ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ ఎపిసోడ్ గా క్రిష్ దీన్ని రూపొందిస్తున్నాడట. మరి కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ తో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజులో ఎంతటి హిట్ కొడతాడో చూడాలి. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ‘నిధి అగర్వాల్’ హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker