పంచదార బదులు పటిక బెల్లం వాడితే ఎన్ని లాభాలో తెలుసా..?
పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వస్తుంది. అయితే పటిక బెల్లం పంచదారకు ప్రత్యామ్నాయంగా చాలా మంది వినియోగిస్తుంటారు.
దీనిలో విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్, విటమిన్ బి12 పటిక బెల్లంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది. అందుకే రోజూ వాడే చక్కెరకు ప్రత్యామ్నాయంగా చెప్తారు. పటిక బెల్లం నీటిలో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, శరీరంలోని అంతర్గత లేదా బాహ్య రక్తస్రావాన్ని తగ్గించడానికి పటిక నీరు చాలా ఉపయోగపడుతుంది.
వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. దగ్గు, శ్లేష్మం సమస్యతో ఉన్నవారు నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని ఇస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి పటిక బెల్లం ఉపయోగపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఆహారం తిన్న వెంటనే జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమయ్యేలా చేస్తుంది. చాలా మంది నేటికీ భోజనం తర్వాత పటిక బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పటికబెల్లం కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెరుగుతుంది. పటిక బెల్లం మతిమరుపుతో పాటు అలసటను పోగొడుతుంది. కంటి చూపుకి బాగా పని చేస్తుంది. పటికను తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.