డాక్టర్ల దగ్గరకి వెళ్ళినప్పుడు ఈ విషయాలు అస్సలు దాచకూడదు. ఆ విషయాలేంటే..?
మనిషి శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. అయితే డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గరా ఏదీ దాచకూడదంటారు.
అవును, అది నిజమే. ఏదీ దాచకుండా చెబితేనే వారికి సమస్య క్లియర్ గా అర్థమై మనకి పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనం సగం సగం చెప్పుకుంటూ పోతే వారి పరిష్కారం కూడా మన సమస్యని పూర్తిగా తొలగించలేకుండా అయిపోతుంది. ఐతే ఏ విషయాల్లో అబద్ధాలు చెప్పకూడదు, ఏ విషయాల్లోపూర్తిగా నిజాలే చెప్పాలి అనే విషయాలు తెలుసుకోవాలి. మీ వయస్సు..ఒక్కో వయస్సు వారికి ఒక్కోలా ట్రీట్ మెంట్ ఉంటుంది.
కాబట్టి వయస్సు దాచడం కరెక్ట్ కాదు. వయస్సు పరంగా వచ్చే కొన్ని వ్యాధులు కనుక్కోవాలంటే మీ సరైన వయస్సు తెలుసుకోవడం తప్పనిసరి. ఆ విషయంలో మొహమాటమేమీ లేకుండా చెప్పాలి. డాక్టర్ రాసే ప్రిస్కిప్షన్ కూడా వయసుకు తగ్గట్టే ఉంటుంది. పొగ తాగే అలవాట్లు..నికోటిన్ అనేది రోగాలని తొందరగా నయం కాకుండా చేస్తుంది.
అందువల్ల డాక్టర్లు అలాంటి వారికి సర్జరీలు చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరైతే అసలు సర్జరీ చేయకపోవచ్చు. మందు అలవాటు..ఆల్కహాల్ వల్ల సర్జరీలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకు మందు తాగే అలవాటు ఎక్కువగా ఉంటే సర్జరీలో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
అందుకే ఆల్కహాల్ అవవాటు ఉంటే ఖచ్చితంగా చెప్పాలి. వైద్యుడి వద్దకి వెళ్ళిన తర్వాత సిగ్గు, మొహమాటం అన్నీ వదిలేసి మీ గురించి చెప్పండి. మీకు సరైన వైద్యం అందాలంటే అది తప్పనిసరి.