Health

ప్యాంట్ వెనుక జేబు‌లో పర్సు పెట్టుకుంటున్నారా..? భవిష్యత్తులో నరకం చూస్తారు.

మన రోజువారీ అలవాట్లే మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అయితే కొన్ని అలవాట్లు ప్రస్తుతం మనకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోయిన.. భవిష్యత్‌లో మాత్రం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆ హబిట్ చూడడానికి చాలా సిల్లీగా అనిపించిన.. వాటి దుష్ఫలితాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి వెనుక జేబులో పర్సు పెట్టడం. అందరూ సాధరణంగా జేబులో పర్సు పెట్టుకుంటారుగా.. దాని వల్ల పాబ్లం ఏముంది అనుకుంటున్నారా..? అవున దాని వల్ల చాలా పెద్ద సమస్యే ఉంది.

అయితే సాదారణంగా మగవాళ్ళు ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుంటారు.. అయితే అలా గంటలు తరబడి పర్సు పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..గంటల తరబడి పర్సును పెట్టుకొని తిరిగితే “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” సమస్య వస్తుందని అంటున్నారు. ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తికి నిలబడినప్పుడు, నడుస్తున్న ప్పుడు కంటే కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

నడుము, పిరుదులలో ఈ నొప్పిని ఫీల్ అవుతారు. ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ ప్రధానంగా సయాటికా అనే ఒక నరానికి సంబంధించిన సమస్య. ఈ నరం మన వెన్నుపాము నుంచి నడుము మీదుగా పాదాల వరకు వ్యాపించి ఉంటుంది. వెనుక జేబులో పర్సు పెట్టుకుంటే.. ఈ నరంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెనుక జేబులోని పర్సు వల్ల సయాటికా నరం మీద ఒత్తిడి పెరుగుతుంది.

కాలికి కూడా తీవ్రమైన నొప్పి రావొచ్చు. ఇకపోతే ఈ సమస్య బారినపడిన ఒక వ్యక్తిని వైద్యుడు ఎంక్వయిరీ చేయగా.. తాను రోజూ 10 గంటలు జేబులో పర్సు పెట్టుకొని ఉంటానని చెప్పాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ ఉందని తేలింది. కొన్నిసార్లు ఎక్కువ దూరం ప్రయాణించే డ్రైవర్లు కూడా పర్సును గంటల తరబడి వెనుక జేబులో ఉంచుకుంటారు. దీని కారణంగా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.. కూర్చున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ పర్సును వెనుక జేబులో ఉంచుకోవద్దు.

దీనికి బదులుగా మీ ముందు జేబులో, జాకెట్ లేదా చొక్కాలో పర్సును ఉంచండి. ఇది మీ దిగువ వీపుపై ఒత్తిడిని కలిగించదు. ఫలితంగా కూర్చోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు.. తప్పనిసరిగా అయితే తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే త్వరగా తగ్గదని హెచ్చరిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker