2050 నాటికి 10 మిలియన్ల మంది పక్షవాతంతో మరణిస్తారట..! ఆ లిస్ట్ లో మీరు ఉండకూడదంటే..?
మనిషి పాత్రధారి, మెదడు అంతర్గత సూత్రధారి. జీవి నియంత్రణ వ్యవస్థ పగ్గాలన్నీ మెదడు దగ్గరే ఉంటాయి. మెదడు ఆదేశిస్తేనే.. కాలు కదులుతుంది, చేయి ఊగుతుంది, ఆలోచన ముందుకు సాగుతుంది. సాక్షాత్తు సూత్రధారే చిక్కుల్లో పడితే.. మెదడుకే సమస్య వస్తే? పక్షవాతం బారినపడినట్టే! కొవిడ్ తర్వాత ఇప్పటికే చాలా మంది స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారు. కొందరు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ఇటీవల పక్షవాతం బారిన పడుతున్న యువకుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇటీవల, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, లాన్సెట్ న్యూరాలజీ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి, తక్కువ మధ్య-ఆదాయ దేశాలలో స్ట్రోక్‌తో మరణించే వారి సంఖ్య 86 నుంచి 91 కి పెరగవచ్చని ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరాలో మార్పు వచ్చినప్పుడు లేదా రక్త సరఫరా తగ్గినప్పుడు మెదడు కణజాలం రక్తం, ఆక్సిజన్‌ను పొందలేనప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది.
స్ట్రోక్ వచ్చినప్పుడు నడవడం, మాట్లాడటం, ఇతరులను అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తుంది. ముఖం, చేతులు, కాళ్లలో తిమ్మిరి లక్షణాలు కనిపించవచ్చు.స్ట్రోక్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయవచ్చని, కొన్ని జీవనశైలి చర్యలతో నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వైకల్యం, మరణాలకు స్ట్రోక్ ప్రధాన కారణం. దీని వల్ల అకస్మాత్తుగా మాట్లాడే సామర్థ్యం కోల్పోవడం, కదలిక, దృష్టి సమస్యలు, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. దాదాపు 1.25 కోట్ల కొత్త స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఎప్పుడైనా స్ట్రోక్‌కు గురయ్యే పరిస్థితిలో నివసిస్తున్నారు.
1990 నుండి 2020 వరకు, కొత్త స్ట్రోక్ రోగుల సంఖ్య 70 శాతం పెరిగింది. 70 ఏళ్లలోపు వారిలో స్ట్రోక్‌ల సంఖ్య దాదాపు 20 శాతం ఎక్కువ. ఇది వయస్సుతో పాటు ఎక్కువగా కనిపించే వ్యాధి యొక్క ఒక రూపం, కానీ ఇది ఏ వయసులోనైనా కనిపిస్తుంది అని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు తెలిపారు.