డయాబెటిస్ పేషెంట్స్ బొప్పాయి పండు తినవచ్చా..? వైద్యలు ఏం చెప్పారో తెలుసా..?
తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఒక్కొక్కో రకమైన పండులో ఒక్కో విధమైన పోషకాలు ఉంటాయి. అందుకే సీజన్ బట్టి వచ్చే అన్ని రకాల పండ్లను తినడం చాలా మంచిది.
పండ్లు రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఆరోగ్యంతో పాటు శక్తి సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతాయి. కొన్ని పండ్లు కొన్ని వ్యాధులకు చికిత్సగా పనిచేస్తాయి. మరికొన్ని పండ్లు వ్యాధులను ధరి చేరనివ్వకుండా దోహదపడుతాయి. పండ్లలో బొప్పాయి చాలా మేలుచేస్తుంది. బొప్పాయిలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు (A, C, E, K) మరియు ఫోలేట్ (విటమిన్ B9) ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, ఇనుము మరియు మాంగనీస్ వంటి ఖనిజాలను అందిస్తుంది.
వృద్ధాప్యం మరియు జీవనశైలి వ్యాధుల ఆగమనాన్ని నిరోధించడంలో సహాయపడే ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్లు మరియు ఇతర యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలను కూడా అందిస్తుంది. 150 గ్రాముల బొప్పాయి పండు కేవలం 60 కేలరీలను మాత్రమే అందిస్తుంది. బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమైన ఆహారం. ఎముకలకు కూడా బొప్పాయి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. బొప్పాయి ఊపిరితిత్తులను కాపాడుతుంది. ముఖ్యంగా ధూమపానం చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బొప్పాయి తినడం చర్మా కాంతి పెరుగుతుంది. నాడీ వ్యవస్థకు సహాయం చేస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతుంది. బొప్పాయి గింజలు శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. హార్ట్ పేషెంట్స్ఇవి తింటే చాలా మంచిది. పచ్చి బొప్పాయి లేదా పండిన బొప్పాయిని తినవచ్చు. బొప్పాయిని అల్పాహారం, భోజనం, స్నాక్స్‌లో చేర్చవచ్చు. లేదా డెజర్ట్‌గా కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో బొప్పాయిని సలాడ్‌గా తీసుకోవచ్చు. బొప్పాయిలు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, వెల్లుల్లి, నిమ్మరసం, ఉప్పు మరియు నల్ల మిరియాలతో జ్యూస్ చేసుకోవచ్చు.