ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు, ఇది పానిక్ అటాక్ కావొచ్చు.
జీవితంలో ఎదురయ్యే కొన్ని చేదు అనుభవాల వల్ల కూడా పానిక్ ఎటాక్‌లు వస్తాయి. ఫోబియా కారణంగా ఒక వ్యక్తి కొన్ని విషయాలకు తీవ్రంగా భయపడతాడు. భయాందోళనలకు సంబంధించిన లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. అయితే ‘పానిక్ ఎటాక్’ అనేది విపరీతమైన ఆందోళన, భయానికి గురయ్యే పరిస్థితి. ఇది కొన్ని గంటలు లేదా కొన్నిసార్లు నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఇప్పుడే చచ్చిపోతాననే భయం, పిచ్చి పట్టినట్టుగా ఉండటం,
నియంత్రణ కోల్పోవడం, శరీరం మొత్తం చెమట పట్టడం, చేతులు, పాదాలు వణకడం, నోరు పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతుగా ఉండటం, ఛాతిలో నొప్పి, మైకము, తలతిరగడం, ఉక్కిరిబిక్కిరి అవడం, కాళ్లు, చేతుల్లో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. భయాందోళనలు ఉన్నప్పుడు చేయాల్సిన కొన్ని పనులు.. ఆందోళన పెరిగినప్పుడు శ్వాసను తీసుకోవడంలో నిమగ్నమవ్వండి.
లోతుగా ఊపిరి పీల్చుతూ వదలండి. ఈ సమయంలో ముక్కు ద్వారా నాలుగు సెకన్ల పాటు శ్వాస తీసుకోండి. అలాగే ఎనిమిది సెకన్ల పాటు నోటి ద్వారా శ్వాసను బయటకు వదలండి. శ్వాస వ్యాయామాలు పానిక్ అటాక్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఇవి మీ ఆత్రుత ఆలోచనల నుంచి మనస్సును దూరంగా ఉంచుతాయి. వ్యాయామం చేయడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గిపోతంది. అయితే ఆందోళనలను తగ్గించడానికి రకరకాల రిలాక్సేషన్ టెక్నిక్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పానిక్ అటాక్ లక్షణాలు.. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, వణుకు, శ్వాస తీసుకోలేనట్టుగా అనిపించడం, ఛాతీ నొప్పి లేదా ఛాతీ అసౌకర్యంగా, మగతగా అనిపించడం, బలహీనత, కడుపునొప్పి, మైకము.