News

పని మనిషికి రెండు కోట్ల శాలరీ, కానీ షరతులు ఏంటంటే..?

చైనా దేశంలోని షాంఘై సిటీకి చెందిన ఓ మహిళ బహిరంగంగా ఇచ్చిన ప్రకటనిది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రకటన సంచలనమైంది. ఆమె ఇల్లు బంగారం గాను ఇలాంటి ప్రకటన చేస్తేకాదు. డబ్బులేమైనా మీ ఇంచి చెట్టుకు కాస్తున్నాయా అనిపిస్తుంది కదా.?! కానీ, ఆవిడ మనం అనుకున్నంత తెలివి తక్కువ చైనా సిటిజన్ కాదు. కండీషన్స్ అప్లై అంటోంది. అయితే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, షాంఘై మహిళ రోజుకు 24 గంటలూ తనతో ఉండే పర్సనల్ కేర్ టేకర్‌ కావాలని యాడ్ ఇచ్చారు.

అయితే, అందుకు ఆమె కోట్ల రూపాయల జీతం ఇస్తున్నప్పటికీ.. కొన్ని షరతులు కూడా పెట్టింది. ఆ షరతుల ప్రకారం.. ఉద్యోగంలో చేరాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించేలా చేస్తుంది. కానీ, ఈ ఉద్యోగం కోసం ఆ మహిళ మాత్రం నెలకు రూ.16 లక్షలకు పైగా చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగం కోసం ఇచ్చిన ప్రకటన ..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది.

ఈ ప్రకటన ప్రకారం, సంబంధిత మహిళను చూసుకోవడానికి పర్సనల్ కేర్ టేకర్‌కు నెలకు రూ. 1,644,435.25 అంటే సంవత్సరానికి రూ. 1.97 కోట్లు చెల్లిస్తారు. అయితే ఈ ఉద్యోగం కోసం ఆమె కొన్ని షరతులు పెట్టింది. ఈ షరతుల ప్రకారం, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే కేర్ టేకర్ తప్పనిసరిగా కనీసం 165 సెం.మీ పొడవు, 55 కిలోల కంటే తక్కువ బరువు ఉండాలి. అంతేకాకుండా, ఆమె 12వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ పూర్తి చేసి ఉండాలి. చూసేందుకు చక్కగా, నీట్‌గా కనిపించాలి. బాగా డ్యాన్స్ కూడా వచ్చి ఉండాలి.

అంతేకాదు.. పాటలు కూడా పాడగలగాలి. హౌస్ కీపింగ్ సర్వీస్ చేసిన ఈ యాడ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, పర్సనల్ కేర్ టేకర్ అవసరమయ్యే మహిళకు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు రోజుకు 12 గంటలు పనిచేసి అదే వేతనం పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆమె వ్యక్తిగత సంరక్షణ టేకర్‌కి సంబంధించిన ఉద్యోగ ఆఫర్‌లో, ఆమె ఎలాంటి ఆత్మగౌరవం లేని వ్యక్తిని కోరుకుంటుందని చెప్పాలి.

అంటే ఆమె తన కాలి షూ తీయమంటే కూడా తీయాలి. వేయమంటే వేయాలి. నీళ్లు అడిగినా ఇవ్వాలి..తక్షణమే ఎలాంటి జ్యూస్‌ కావాలంటే అది తెచ్చి అందించాలి. అలాగే ఉద్యోగ మర్యాదలో భాగంగా యజమానురాలి ఇంటికి వచ్చే ముందు కేర్ టేకర్ గేటు దగ్గరే వేచి ఉండాలి. ఈ అంతుచిక్కని జాబ్ ఆఫర్ ఇప్పుడు చాలా మంది నిరుద్యోగుల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వింత జాబ్ ఆఫర్లకు సంబంధించిన సంఘటనలు ఇంతకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker