బిగ్ బాస్ డబ్బులతో రైతు బిడ్డ జల్సాలు, బయటపడుతున్న పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం.
బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ కాగా… ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు. దాంతో పల్లవి ప్రశాంత్ పొందాల్సిన ప్రైజ్ మనీ తగ్గింది. నగదు బహుమతితో పాటు ఒక కారు, నెక్లెస్ కూడా ఇచ్చారు. అయితే నేల తల్లి సాక్షిగా రైతులకు అండగా ఉంటానని ప్రమాణాలు చేశాడు. అంతటితో ఆగకుండా తను కనుక బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతానని మాట ఇచ్చాడు.
పంచిన ప్రతి ఒక్క రూపాయి లెక్కలతో సహా చూపిస్తాను అంటూ శపధాలు చేశాడు. కట్ చేస్తే ఊహించని విధంగా ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అతనికి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది. కానీ హౌస్ లో ఉన్నప్పుడు ఒక లెక్క .. బయటకు వచ్చిన తర్వాత మరో లెక్క అన్నటుగా ప్రశాంత్ తీరు మారిపోయింది. తనకు వచ్చిన డబ్బులు రైతులకు పంచుతాను అని చెప్పిన మాట గాలికి వదిలేశాడు.
పైగా ఎవరైనా డబ్బులు ఎప్పుడు పంచుతావని అడిగితే… ఏవేవో రూల్స్ లాగడం మొదలెట్టాడు. నెటిజన్లు ఏకిపారేస్తుడటంతో మొదటి సాయం చేశాడు. లక్ష సహాయం చేసి కోటి రూపాయల బిల్డప్ ఇచ్చాడు. అది చేసి నెలలు గడుస్తున్నా మరో రైతుకు సాయం చేసింది లేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. కానీ బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని మాత్రం ఓ రేంజ్ లో వాడుకుంటున్నాడు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తున్నాడు. ఎక్కువగా తన గురువు శివాజీ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ నుంచి గిఫ్ట్ గా వచ్చిన కొత్త కారులో షికార్లు చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన కొత్త కారుని గురువు శివాజితో ఓపెన్ చేయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కింద నెటిజన్లు ప్రశాంత్ – శివాజీలను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. రైతు పేరు చెప్పుకుని గెలిచి ఇప్పుడు ఇలా చేయడం న్యాయమేనా అంటూ నిలదీస్తున్నారు. పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఇది అంటున్నారు.