ఈ ఆకుకూర తరచూ తింటుంటే మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు రావు.
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రతి వైద్యులు కూడా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇక ఆకు కూరల్లో పాలకూర ఒకటి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఇతర కూరల్లో జోడించి కూడా వండుకోవచ్చు. పాలకూర తినడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఎందుకంటే ఇందులో కేవలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి సంబంధించి మంచి పోషకాలుంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఏ,సి, కె. వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్‌ను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ఉంచుకోవచ్చు. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అయితే పాలకూర చిన్న పిల్లల ఎముకల ఎదుగుదలకు, పటిష్టతకు ఎంతో మంచిది. పాలకూర రక్త హీనత, నరాల బలహీనత పోగొడుతుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. పాలకూరలోని లాక్టిక్ ఆమ్లం బాలింతలలో పాల ఉత్పత్తికి సహకరిస్తుంది. పాలకూర గర్భవతుల కడుపులోని పిండం ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచిది. పాలకూర గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది. పాలకూరలో కాల్షియం, ఇనుము, మాంసకృత్తులు, పీచు, విటమిన్ బి, సి ఉంటాయి.
పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు పిండిలో, పకోడీల పిండిలో, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ పాలకూరను తీసుకోవచ్చు. పాల కూర వారంలో రెండు సార్లు తీసుకుంటే వయసుతో పాటు వచ్చే మతిమరుపు త్వరగా దరిచేరకుండా చూసుకోవచ్చు. దీనిలో లభించే విటమిన్ సి, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాడిడ్ క్యాన్సర్లను నివారించటంలో తోడ్పడతాయి. దీనిని అహారంలో తరచుగా తీసుకునే వారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే ఇనుము రక్తహీనతను తగ్గించటంలో సహాయపడతుంది.
రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. పాలకూరలో బీటా కెరాటిన్, విటమిన్ ఎలు వృద్ధాప్యఛాయలు త్వరగా రాకుండా కాపడతాయి. చర్మానికి రక్షణ కల్పించటంలో పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మంలో మెరుపుదనాన్ని ఇవ్వటంలో ఇది సహాయపడుతుంది. పక్షవాతం రాకుండా నివారించటంలో పాలకూర బాగా ఉపకరిస్తుంది. ఆస్మా వంటి లక్షణాలను తగ్గిచంటంలో సహాయపడుతుంది.
మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ A కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కళ్ళ మంటలను, చికాకులను తగ్గిస్తుంది. బోలు ఎముకల వ్యాధికి చికిత్స చేసి, దానిని నిరోధించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ స్థాయిని శరీరంలోని వివిధ భాగాలకు అందించడం ద్వారా కండరాలను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి.