కన్నతల్లి కోరిక నెరవేర్చిన ఫైమా, ఆ కోరిక ఏంటో తెలుసా..?
‘పటాస్’ షోలో స్టాండప్ కామెడీ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఫైమా.. ఆ తర్వాత ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత సహాయ పాత్రల్లో కనిపించిన ఈమె.. తన మార్క్ విచిత్రమై యాస, టైమింగ్‌తో ఆకట్టుకుంది. ఒకానొక దశలో టీమ్ లీడర్స్‌నే డామినేట్ చేసి మరీ గుర్తింపు తెచ్చుకుంది.
అయితే జబర్దస్త్ ఫైమా.. పటాస్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి.. జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో మెయిన్ కంటెస్టెంట్ గా చేస్తూ.. తన టైమింగ్ తో, యాక్టింగ్ తో, ఆకట్టుకుంది. ఒకనొకదశలో టీమ్ లీడర్స్ నే డామినేట్ చేసిందని చెప్పవచ్చు.
ఈ గుర్తింపుతో బిగ్ బాస్ షోలో సైతం పాల్గొంది ఫైమా. హౌస్ లో దాదాపు 10 వారాలపాటు ఉండి గట్టి పోటీ ఇచ్చింది. హౌస్ లో ఉన్నప్పుడే తన తల్లిగురించి చెబుతూ.. ఆమెకు ఓ ఇల్లు కట్టివ్వాలని చెప్పుకొచ్చింది. తాజాగా తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఫైమా. తాను కష్టపడి కట్టుకున్న కొత్తింట్లోకి అడుగుపెట్టింది ఫైమా. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది.
ఇక త్వరలోనే జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. అద్భుతమైన ఇంటీరియల్ డిజైనింగ్ తో ఇల్లును పూర్తి చేసింది ఫైమా. తాజాగా జరిగిన గృహ ప్రవేశానికి జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలు వచ్చి.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఫైమాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా తన తల్లిని పట్టుకుని ఏడ్చింది ఫైమా.
ప్రస్తుతం ఫైమా పలు గేమ్ షోల్లో పాల్గొంటూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. మరి తన తల్లి కోరికను నెరవేర్చిన ఫైమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.