Health

పాదాల వాపును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

కాళ్లవాపు అనేది గుండెజబ్బులకు ప్రధాన లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికే ప్రమాదం కావచ్చంటున్నారు. కాళ్ల వాపులు అనేవి ప్రారంభంలో కాళ్ల మడిమెల వద్ద, ఆ తర్వాత పాదం వద్ద వస్తాయి. అయితే నొప్పి ఉండకపోవడంతో దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్వాస తీసుకోకపోవడం, ఛాతీలో నొప్పి రావడం, నడవలేక పోవడం వంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదిస్తారు.

అప్పుడు వారిని పరీక్షించి అసలు దీనికి కారణం కాళ్ల వాపులో ఉందని వైద్యులు గుర్తించగలుగుతారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కాళ్లు, పాదాలలో వాపు కనిపిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉంటే ముఖం కూడా ఉబ్బుతుంది. ఇది ఇలానే వదిలేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. లివర్ సమస్యలు ఉన్నవారిలో కూడా పాదాల్లో కాళ్లలో, వాపు కనిపిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల పాదాలలో నీరు చేరి ఉబ్బినట్టు అవుతాయి.

కాబట్టి పాదాల వాపుకు లివర్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణం అని భావించవచ్చు. కాలంలో ఉండే సిరలు చక్కగా పనిచేయడం చాలా ముఖ్యం. ఆ సిరల్లోనుంచి రక్తప్రవాహం సరిగా కాకపోయినా నీరు నిలిచిపోయి పాదాలవాపు వస్తుంది. ఇది ఎక్కువగా కూర్చుని పని చేసేవారు, నిల్చని పనిచేసే వారిలో కనిపిస్తుంది. అలాగే ఊబకాయం ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువ. వాపును పట్టించుకోకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది.

చివరికి గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి కాలు, పాదాలలో వాపు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. గుండె సరిగా రక్తాన్ని పంపు చేయనప్పుడు కూడా ఇలాంటి పాదాల వాపు, కాళ్ళ వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో ఇలా రెండు కాళ్లల్లో వాపు కనిపించడం సహజం. వాపు ఉన్నా, నొప్పి ఉండదు. కానీ నడుస్తున్నప్పుడు ఆయాసం వంటివి వస్తాయి.

ఇలా జరిగితే వెంటనే గుండె వైద్య నిపుణులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పాదాల వాపుతో బాధపడేవారు ఆహారంలో సోడియం తీసుకోవడం తగ్గించాలి. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల వాపు సమస్య మరింత పెరుగుతుంది. అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల పాదాల వాపు వస్తుందని ముందే చెప్పుకున్నాం. కాబట్టి కాళ్లు, పాదాలలో వాపు కనిపిస్తే తేలికగా తీసుకోకుండా వైద్య నిపుణులను కలిసి చికిత్స తీసుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker